తెలంగాణ

ఆరాధన కేసు మూసివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 27: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరాధన సముదారియా (13) మృతి కేసులో ఎలాంటి ఆధారాలు లభించలేదని సికిందరాబాద్ మోండా మార్కెట్ పోలీసులు కేసును మూసివేశారు. నిరుడు అక్టోబర్ 8న కఠోర ఉపవాస దీక్ష చేపట్టిన బాలిక ఆరాధన మృతి చెందిన విషయం తెలిసిందే. వ్యాపారంలో అభివృద్ధి, మంచి సంపద కలుగుతుందని మత గురువుల సూచనల మేరకు బాలిక తండ్రి లక్ష్మీచంద్ తన కుమార్తెతో 68 రోజుల పాటు ఉపవాస దీక్ష చేయించాడు.
దీంతో అనారోగ్యానికి గురై బాలిక ఆరాధన మృతి చెందింది. మూఢనమ్మకానికి బాలిక బలైందని బాలల హక్కుల సంఘం బాలిక తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పది నెలల పాటు సాగిన దర్యాప్తులో బాలిక మృతిపై ఆధారాలు లభించలేదని, కేసును మూసివేస్తున్నట్టు పోలీసులు బాలల హక్కుల సంఘానికి నోటీసు ద్వారా తెలిపారు. ఇలా ఉండగా, నిర్బంధ కఠోర ఉపవాస దీక్షతో ప్రాణాలు కోల్పోయిన బాలిక ఆరాధన (13) మృతికి కారకులైన మతగురువు, ఆమె తల్లిదండ్రులపై పోలీసులు చర్య తీసుకోకుండా ఆధారాలు లభించలేదని కేసును మూసివేయడం పట్ల బాలల హక్కుల సంఘం తీవ్రంగా ఖండించింది. కోర్టుకు వెళ్లి నిందితులకు శిక్ష పడేలా చేస్తామని బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు తెలిపారు. పోలీసులు ఫిర్యాదుదారులను కానీ, స్థానికులను గానీ విచారించకుండా కేవలం మతాచారాలకు సంబంధించిన అభిప్రాయాలతో ఉన్నారని ఆయన ఆరోపించారు.
వ్యాపారంలో రాణించేందుకేనంటూ ఉపవాస దీక్షపై బాలిక కుటుంబ సభ్యులు ఓ హిందీ దిన పత్రికలో ప్రకటన ఇచ్చారని, ఇంతకంటే పోలీసులకు ఆధారాలేమి కావాలని ఆయన ప్రశ్నించారు.