తెలంగాణ

మల్లన్న నామస్మరణతో మార్మోగిన కొమురవెల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేర్యాల, మార్చి 27: సిద్దిపేట జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జునస్వామి జాతరలో చివరి ఘట్టమైన అగ్నిగుండాల కార్యక్రమం సోమవారం అంగరంగ వైభవంగా జరి గింది. సోమవారం ఉదయం దేవాలయం నుంచి మల్లన్న ఉత్స వ విగ్రహాలను తోట బావి వద్దకు తీసుకొని వచ్చి ప్రత్యేక పూజ లు జరిపారు. స్వామివారికి అభిషేకం, పూజలు నిర్వహించారు. అనంతరం వివిధ కర్రలతో అగ్నిగుండాన్ని తయారు చేసి వాటిని వెలిగించారు. ఆ తర్వాత భక్తులు కోర్కెలు తీర్చే కొంరెల్లి మల్లన్న అంటూ.. మల్లన్నను స్మరించుకుంటూ భక్తిశ్రద్ధలతో అగ్నిగుండాలను దాటారు. ఈ సందర్భంగా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, దేవస్థాన చైర్మన్ బద్దిపడిగ కృష్ణారెడ్డి, ఇవో రామకిషన్‌రావు ప్రత్యేక పర్యవేక్షణ జరిపారు. అగ్నిగుండాల కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా గజ్వేల్ ఎసిపి గిరిధర్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. ఆలయ పూజారులు, సిబ్బంది, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.