తెలంగాణ

కుప్పకూలిన వ్యవసాయ రంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 27: రాష్ట్రప్రభుత్వం మూస పద్ధతిలోనే బడ్జెట్ ప్రవేశపెట్టిందని , రాష్ట్రంలో వ్యవసాయ రంగం కుప్పకూలిందని, ఊహాజనిత గణాంకాలతో ప్రజలను ప్రభుత్వం మభ్యపెట్టాలని చూస్తోందని బిజెపి ఎమ్మెల్యే డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. సోమవారం నాడు శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన పాల్గొంటూ బడ్జెట్ లెక్కలు అవాస్తవికంగా ఉన్నాయని అన్నారు. పొంతన లేని లెక్కలతో ఏ విధంగా అమలుచేస్తారని నిలదీశారు. సంక్షేమ రంగానికి గతంలో కేటాయించిన నిధులనే సక్రమంగా ఖర్చు చేయలేదని, ప్రాజెక్టులకు గతంలో ఎక్కువగా నిధులు చూపించినా, తర్వాత సవరించిన బడ్జెట్‌లో కుదించారని, చివరికి నిధులు మరింత తక్కువగా విడుదల చేశారని ఆరోపించారు. తలసరి అప్పు తీసేస్తే తలసరి ఆదాయం లక్ష మాత్రమే ఉందని చెప్పారు. రైతుల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేకపోయిందని పేర్కొన్నారు. భూసార పరీక్షలకు నిధులు ఇవ్వలేదని, నకిలీ విత్తనాల కంపెనీలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. వ్యవసాయ రంగాన్ని గట్టెక్కించడంలో విఫలమైందని తెలిపారు. తాగునీరు పథకాలు సుదూరకలగా మారాయని, రెండు పడకల ఇళ్లు ఎప్పుడు పూర్తవుతాయో తెలియడం లేదని అన్నారు. కేంద్రం చలువతోనే నిరంతర విద్యుత్ వస్తోందని గుర్తించాలని చెప్పారు. బిసి వర్గాలపై అకస్మాత్తుగా ఎనలేని ప్రేమను ఒలకబోస్తున్నారని, వారు అర్థం చేసుకుంటున్నారని అన్నారు. సంచార జాతులకు గతంలో ఐదు కోట్లు కేటాయించి ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని తెలిపారు. సబ్‌ప్లాన్ చట్టంలో కూడా అనేక లొసుగులు ఉన్నాయని, మద్యం అమ్మకాల ద్వారా భారీ ఆదాయం పొందాలని చూడటం సరికాదని అన్నారు.