తెలంగాణ

మెస్ చార్జీల పెంపుపట్ల సిఎం కెసిఆర్‌కు బిసి నేతల అభినందనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 28: మెస్ చార్జీల పెంపు పట్ల హర్షం వ్యక్తం పలు సంఘాల ప్రతినిధులు, నాయకులు, విద్యార్థులు మంగళవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావును కలిసి కృత్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ‘ఉద్యమ సమయంలో చెప్పినట్టు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంది. 15 శాతం వృద్ధి రేటు ఉంది. పెరిగిన సంపద పేదలకు ఉపయోగపడాలి, వారి జీవితాల్లో మార్పు రావాలి. అందుకోసమే వెనుకకు పోకుండా వేల కోట్లు వెచ్చించి చాలా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం’ అన్నారు. ఎప్పటి నుంచో మెస్ చార్జీలు పెరగక, పెరిగిన ధరలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ విషయాన్ని గ్రహించే మెస్‌చార్జీలు పెంచామని ముఖ్యమంత్రి అన్నారు. బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య, రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు పలువురు బిసి సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రికి పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే టిఎన్‌జివోల సంఘం గౌరవాధ్యక్షుడు దేవిప్రసాద్, అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, ఎంబిసిల సంఘం అధ్యక్షుడు కాళప్ప, నాయకులు సూర్యారావు, ప్రేమ్‌లాల్, సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూమన్న, ఎంపి బాల్క సుమన్, బాబా ఫసీయుద్దీన్ తదితరులు ఉన్నారు.