తెలంగాణ

4వేల కోట్ల అదనపు నిధులు కేంద్ర పథకాల ద్వారా సాధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 28: కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రాష్ట్రానికి మూడు నుంచి నాలుగు వేల కోట్ల రూపాయలు అదనంగా లభించే విధంగా ప్రతిపాదనలు రూపొందించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ అన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి అదనంగా నిధులు పొందడానికి ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్ అరవింద్‌కుమార్‌తో ఆర్థికశాఖ అధికారులు సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు. సచివాలయంలో మంగళవారం కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి నిధులు పొందే శాఖాధిపతులతో ప్రధాన కార్యదర్శి సింగ్ సమావేశం నిర్వహించారు. కేంద్ర అధికారులతో రాష్ట్ర అధికారులు సత్సంబంధాలు నెలకొల్పుకోవాలని సూచించారు.
రైట్ టు పబ్లిక్ సర్వీస్ బిల్లుకు సంబంధించి నల్సార్ యూనివర్సిటీ రూపొందించిన బిల్లును కార్యదర్శులు అందరికీ పంపించామని, దీనిని అధ్యయనం చేయాలన్నారు. ఇతర రాష్ట్రాలలో ఈ చట్టం అమలు, ప్రజల అనుభవాలపై అధ్యయనం చేయాలన్నారు. గతంలో బడ్జెట్ ప్రతిపాదనలలో ప్రణాళిక, ప్రణాళికేతర పద్దులు ఉండేవని, ప్రస్తుతం కేంద్ర మార్గదర్శకాలతో ప్రగతి పద్దు, నిర్వహణ పద్దుగా మారిన విషయాన్ని శాఖాధిపతులు దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఎస్‌సి, ఎస్‌టి ప్రత్యేక నిధిపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టిసారించారని ఎప్పటికప్పుడు సమీక్షించనున్నారని చెప్పారు. ఒక ఏడాదిలో కేటాయించిన నిధులు ఖర్చు చేయకపోతే తదుపరి ఏడాదికి క్యారె ఫార్వడ్ అవుతాయన్నారు. అలాంటి పరిస్థితి తల్తెకుండా ఏ ఏడాదికి ఆ ఏడాది కేటాయించిన నిధులు ఖర్చు చేయాలని ప్రధాన కార్యదర్శి సూచించారు. ఎస్‌సి, ఎస్‌టి ప్రత్యేక నిధిపై తయారు చేసిన బిల్లు ఆమోదం పొందడంతో 10 రోజులలో డ్రాప్ రూల్స్ సమర్పించాలని రెవిన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు.
జిల్లా స్థాయి కమిటీ ద్వారా కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు చట్టం అమలును పర్యవేక్షిస్తారన్నారు, ఎస్‌సి, ఎస్‌టిల సంక్షేమశాఖల మంత్రుల ఆధ్వర్యంలోని నోడల్ ఏజెన్సీలు చట్టం అమలును నిరంతరం పర్యవేక్షిస్తాయన్నారు. వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు.