తెలంగాణ

పంటల విస్తీర్ణంపై కాకిలెక్కలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 28: తెలంగాణ రాష్ట్రంలో పంటలసాగు విస్తీర్ణానికి సంబంధించి కాకిలెక్కలు ఇవ్వవద్దని, ఖచ్చితమైన సమాచారం మాత్రమే ఇవ్వాలని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. జిల్లాల వ్యవసాయ అధికారులతో (డిఎఓ) మంగళవారం ఆయన సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ, ఇప్పటి వరకు వివిధ శాఖల ద్వారా లభిస్తున్న సమాచారం పరిశీలిస్తే ఒకదానికి మరొక దానికి పొంతన ఉండటం లేదన్నారు. ప్రభుత్వానికి కాకిలెక్కలు పంపించవద్దని, ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలన్నారు.
ఎఓలు, ఎఇఓలు తాము పనిచేసే హెడ్‌క్వార్టర్‌లోనే ఉండాలని ఆదేశించారు. రాష్టవ్య్రాప్తంగా 2000 హెక్టార్లకు ఒక ఎఇఓ (వ్యవసాయ విస్తరణ అధికారి) ను నియమించామని, వీరు క్షేత్రస్థాయిలో పర్యటించి సరైన సమాచారాన్ని సేకరించాలని సూచించారు. ప్రతి ఎఇఓ వద్ద ఒక మినీ భూసార ప్రయోగశాలను ఏర్పాటు చేస్తున్నామని, వీటిని రైతులు పూర్తిగా ఉపయోగించుకునేలా చూడాలని కోరారు. ఇన్‌పుట్ సబ్సిడీ 702 కోట్ల రూపాయలను విడుదల చేశామని మంత్రి తెలిపారు. అర్హులైన రైతుల ఖాతాల్లోనే ఈ నిధులు జమ చేయాలని సూచించారు.
ఇటీవల వడగళ్ల వానకు పంట నష్టపోయిన రైతులకు కూడా ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తామన్నారు. ప్రభుత్వ హామీ మేరకు రుణమాఫీ పూర్తయిందని మంత్రి గుర్తు చేశారు. రైతులు చెల్లించే నాన్‌సబ్సిడీ పోర్షన్‌ను డిపాజిట్ చేయించి, యంత్రాలను వెంటనే సరఫరా చేయాలని కోరారు. రైతులు కోరిన కంపెనీల యంత్రాలను మాత్రమే ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్యదర్శి సి. పార్థసారథి, కమిషనర్ జగన్‌మోహన్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..జిల్లాల వ్యవసాయ అధికారులతో మంగళవారం సచివాలయం నుండి వీడియో
కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్న వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి