తెలంగాణ

గాంధీ ఆస్పత్రి ఆర్‌ఎంఓపై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 29: వరుస వివాదాలతో పరువు తీస్తున్న గాంధీ ఆస్పత్రిపై ఎట్టకేలకు ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. బుధవారం గాంధీ ఆస్పత్రిలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి లక్ష్మారెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి ఆర్‌ఎంఓ సర్వస్వతిని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు సరెండర్ చేస్తున్నట్టు ప్రకటించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇలాంటి చర్యలు ఇకముందు కూడా కొనసాగుతాయని, అధికారులు, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. రెండు గంటల పాటు ఆస్పత్రిలోని అన్ని విభాగాల్లో మంత్రి కలియతిరిగారు. తర్వాత ఆస్పత్రి అధికారులు, ఉద్యోగులు, సిబ్బందితో సమావేశమయ్యారు. ఒకవైపు ప్రభుత్వం వైద్య రంగానికి ప్రాధాన్యత ఇస్తుంటే, మరోవైపు గాంధీ ఆస్పత్రిలో రోగుల పట్ల వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని మంత్రి హెచ్చరించారు. ఉన్నతాధికారుల ఆదేశాలను కూడా ఆర్‌ఎంఓ బేఖాతర్ చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో డిఎంఇకి సరెండర్ చేయాలని నిర్ణయించినట్టు మంత్రి తెలిపారు. గాంధీ ఆస్పత్రికి ఎంతో పేరు ఉండేదని, అలాంటిది ఇటీవల చోటుచేసుకున్న ఉదంతాలతో చెడ్డపేరు వచ్చిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. గడువు తీరిన మందులను రోగులకు ఇచ్చినట్టు వచ్చిన ఆరోపణలపై కూడా మంత్రి ఆరా తీశారు.

చిత్రం.. గాంధీ ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్న మంత్రి లక్ష్మారెడ్డి