తెలంగాణ

పెరుగుతున్న హెచ్‌ఐవి కేసులు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 29: తెలంగాణలో హెచ్‌ఐవి రోగుల సంఖ్య పెరుగుతోంది. గత ఏడాది ఎయిడ్స్ కేసుల నమోదు పరిశీలిస్తే, రాష్టవ్య్రాప్తంగా ఏడుశాతం పెరగగా, ఒక్క హైదరాబాద్ నగరంలోనే 33 శాతం హెచ్‌ఐవి ఎయిడ్స్ కేసులు నమోదయ్యాయి. అధికారిక వివరాల ప్రకారం 2015లో 1,61,552 మంది హెచ్‌ఐవి బారిన పడగా, 2016లో వీరి సంఖ్య (జనవరి 2017 నాటికి) 1,73,398కు చేరింది. మొత్తంగా 11,846 కొత్త కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో ఏటా వెయ్యికి పైగా హెచ్‌ఐవి, ఎయిడ్స్ బారిన పడుతున్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే 33 శాతం కేసులు నమోదవుతున్నట్టు హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ సమాచార హక్కు ద్వారా సేకరించిన అధికార డేటాలో పేర్కొంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని మూడు యాంటి రిటోవైరల్ థెరపి సెంటర్లలో 55,319 మంది హెచ్‌ఐవి బాధితుల కేసుల నమోదయ్యాయి. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ థెరపి కేంద్రంలో 28,807, గాంధీ జనరల్ హాస్పిటల్ కేంద్రంలో 13,938 మంది కాగా, 12,574 మంది ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రి థెరపి కేంద్రాలలో పేరు నమోదు చేసుకుని చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ తరువాత ఖమ్మం జిల్లాలో 14,361 మంది హెచ్‌ఐవి బాధితులు నమోదయ్యారు. మహబూబ్‌నగర్‌లో 13,911, నల్గొండ 13,745, వరంగల్ 12,936, సంగారెడ్డి 10,995, నిజామాబాద్ 10,726 మంది బాధితులు తమ పేర్లు నమోదు చేసుకుని చికిత్స పొందుతున్నట్టు హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ అధ్యక్షుడు ముజ్తాబ్ హసన్ అస్కారి తెలిపారు. రాష్ట్ర విభజనకు ముందుకు హెచ్‌ఐవి కేసులను పరిశీలిస్తే 2015 నుంచి సాలీనా సరాసరిగా 950 నుంచి వెయ్యి కేసులు నమోదవుతున్నట్టు అస్కారి తెలిపారు. ఎయిడ్స్ బాధిత కేసుల వివరాల సేకరణలో ఎయిడ్స్ కంట్రోల్ బోర్డు, యాంటి రెటివల్ థెరపి కేంద్రాల మధ్య వ్యత్యాసం ఉందని తెలిపారు. ఈ విషయమై ఫీల్డ్ లెవెల్ సర్వే నిర్వహించి సమగ్ర నివేదికను ఎయిడ్స్ కంట్రోల్ ప్రాజెక్టు డైరెక్టర్‌కు నివేదించామని అస్కరి తెలిపారు.