రాష్ట్రీయం

తిరుమలలో ఉగాది ఆస్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మార్చి 29: తెలుగు నూతన సంవత్సరాది అయిన శ్రీ హేమలంబ నామ ఉగాది వేడకలు తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం వైభవంగా జరిగాయి. ఉదయం 7 నుంచి 9గంటల వరకు నడుమ ఉగాది ఆస్థానం ఆగమోక్తంగా జరిగింది. ఇందులో భాగంగా శ్రీవారి ఉత్సవర్లను బంగారువాకిలిలో సర్వభూపాల వాహనంపై గరుడాళ్వారుకు అభిముఖంగా కూర్చోబెట్టారు. శ్రీవారి ఉత్సవర్ల పక్కనే మరో పీఠంపై స్వామివారి సర్వసైనాధ్యక్షులు శ్రీ విశ్వక్సేనుల వారిని వేంచేపు చేశారు. అనంతరం అర్చక స్వాములు అస్థానం నిర్వహించారు. ఆస్థానం అయిన తరువాత ఆస్థాన పండితులు పంచాంగ శ్రవణం చేశారు. ఈ హేమలంబ నామ సంవత్సరంలో దేశ కాల, రుతు పరిస్థితులను, నక్షత్ర, రాశి, వారాది ఫలితాలను తెలియజేశారు. అనంతరం ప్రసాద నివేదనతో కార్యక్రమం ముగిసింది. ఉగాదిని పురస్కరించుకుని టిటిడి ఉద్యావనవనశాఖ ఆధ్వర్యంలో ఆలయం లోపల చేపట్టిన అంలకరణలు, ధ్వజస్థంభాన్ని అలంకరించిన తీరు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలోటిటిడి ఇవో డి.సాంబశివరావు, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.