తెలంగాణ

టీచర్లు ఎక్కువ.. విద్యార్థులు తక్కువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 30: తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల, ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రకారం చూస్తే టీచర్లు ఎక్కువగానే ఉన్నారని కేంద్రప్రభుత్వం తేల్చింది. జాతీయ స్థాయిలో సైతం ఈ నిష్పత్తి సరిపడా ఉందని మానవ వనరుల మంత్రిత్వశాఖ పేర్కొంది. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టిమ్ ఫర్ ఎడ్యుకేషన్ నివేదిక ప్రకారం జాతీయ స్థాయిలో ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి 24:1గానూ, మాధ్యమిక పాఠశాలలకు సంబంధించి ఈ నిష్పత్తి 27:1గానూ ఉంది. చాలా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రాధమిక, మాధ్యమిక స్థాయిలో పిటిఆర్ సంతృప్తికర స్థాయిలో ఉందని రాజ్యసభలో వి విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు హెచ్‌ఆర్‌డి సహాయ మంత్రి ఉపేంద్ర కుశ్వాహా మాట్లాడుతూ కొన్ని బడుల్లో టీచర్ల సంఖ్య పిటిఆర్ కన్నా తక్కువగా ఉందని, టీచర్ల సంఖ్య చాలినంత ఉన్న నేపథ్యంలో వారి సేవలను అత్యంత అనుకూల రీతిలో వినియోగించుకోవల్సిన అవసరం ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఈ రెండు స్థాయిల్లో పిటిఆర్ 20:1, 20:1గా ఉంది. తెలంగాణలో 22:1, 22:1 గా ఉంది. యుడిఐఎస్‌ఇ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ఏకోపాధ్యాయ ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 2013లో 15,003 ఉండగా, 2016 నాటికి 8417కు తగ్గింది. టీచర్ల భర్తీ, సర్వీసు కండిషన్‌లు, వారి నియుక్తి ప్రాధమికంగా రాష్ట్రప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికార పరిధిలోనే ఉంటాయని, అయితే కేంద్రప్రభుత్వం మాత్రం ప్రాధమిక విద్యా స్థాయిలో సర్వ శిక్షా అభియాన్, మాధ్యమిక స్థాయిలో రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ కార్యక్రమాల్లో భాగంగా సముచితమైన నిష్పత్తిని నిర్వహించేందుకు రాష్ట్రప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అదనపు టీచర్ల విషయంలో సహాయాన్ని అందిస్తోందని వివరించారు. టీచర్ల భర్తీ, నియుక్తి ప్రక్రియలను వేగవంతంగా నిర్వహించే అంశంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికపుడు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాతాలను వాకబు చేస్తోందని కూడా మంత్రి తెలిపారు.