తెలంగాణ

మొదలైన టెన్త్ వాల్యూయేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 30: తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు గురువారం నాడు పూర్తికాగానే మూల్యాంకనానికి సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలకు 5,38,226 మందికి హాల్‌టిక్కెట్లు జారీ చేశారు. ఇందులో రెగ్యులర్ విద్యార్ధులు 5,09,831 మంది కాగా, గతంలో పరీక్షలు రాసి ఫెయిలైన వారు 28,395 మంది రాశారు. అంటే వీరంతా కలిపి ఆరు సబ్జెక్టులకు 11 పేపర్లు చొప్పున దాదాపు 59 లక్షల పేపర్లను రాశారు. రాష్ట్రంలో గతంలో ఉన్న 10 జిల్లాల కేంద్రాల్లో స్పాట్ వాల్యూయేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. స్పాట్ కేంద్రాలకు చీఫ్ సూపరింటెండెంట్‌లను, అబ్జర్వర్లను, ట్యాబులేటర్లను, వాల్యూయేషన్ చేసే వారిని, సబ్జెక్టు ఎక్స్‌పర్టులను, అసిస్టెంట్ ఎగ్జామినర్లను నియమించారు. వారందరికీ పరీక్ష పేపర్ల వాల్యూయేషన్‌కు సంబంధించి మార్గదర్శకాలు జారీ అయ్యాయి.
అసలు స్పాట్ 3వ తేదీన మొదలై 14వ తేదీ వరకూ జరుగుతుంది. తొలుత మైనర్ సబ్జెక్టులతో మొదలై తర్వాత మేజర్ సబ్జెక్టుల వాల్యూయేషన్ జరుగుతుంది. 10 జిల్లాల్లో 10 స్పాట్ కేంద్రాలతో పాటు హైదరాబాద్‌లో అదనంగా మరో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. స్పాట్‌కు వచ్చే టీచర్ల బయోమెట్రిక్ సేకరణ చేయాలని, అదే విధంగా స్పాట్‌లో అక్రమాలకు తావు లేకుండా సిసి కెమరాలు ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈసారి పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన తీరుపై పరీక్షల కమిషనర్ సురేందర్‌రెడ్డిని ఉపాధ్యాయ సంఘా లు, విద్యార్థి సంఘాలు అభినందించాయి. నెలాఖరుకు ఫలితాలను విడుదల చేసేందుకు వీలుగా పాఠశాల విద్యాశాఖాధికారులు సన్నద్ధం చేస్తున్నారు.