తెలంగాణ

నల్లగొండలో పోటీ చేసినా కెసిఆర్‌కు ఘన విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మార్చి 30: తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు నేడో రేపో కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపి ఎన్నికల కమిషన్‌కు బాధ్యతలు అప్పగించనుందని ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ప్రతి ఎంపి స్థానంలో కొత్తగా రెండు అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశముందన్నారు. గురువారం మిర్యాలగూడ ఎమ్మెల్యే ఎన్.్భస్కర్‌రావుతో కలి సి ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ సిఎం కెసిఆర్ నల్లగొండ జిల్లా నుండి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారన్న ప్రచారాన్ని తాము స్వాగతిస్తున్నామని అన్నారు. గతం లో ఎన్‌టిఆర్ సైతం నల్లగొండ నుండిపోటీ చేయగా భారీ మెజార్టీతో జిల్లావాసులు గెలిపించారన్నారు. సిఎం నల్లగొండ, మిర్యాలగూడలలో ఎక్కడి నుండి పోటీ చేసినా భారీ మెజార్టీతో గెలుస్తారని ఈ జిల్లా అభివృద్ధికి అది మేలు చేస్తుందన్నారు. కొంతమంది ప్రతిపక్ష నాయకులు వారి స్థాయి మరిచి సిఎం కెసిఆర్‌పై, మంత్రి జగదీష్‌రెడ్డిపై అనుచిత విమర్శలు చేస్తుండటం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. రాజకీయాల్లో హేతుబద్ధతతో హుందాతనంతో కూడిన విమర్శలు చేయాలేతప్ప నోటికొచ్చినట్లుగా మాట్లాడితే ప్రజలు చూస్తూ ఊరుకోబోరన్నారు.