తెలంగాణ

‘డిటెన్షన్’తో విద్యార్థులకు శాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 29: విద్యా కేంద్రీయ సలహా మండలి కేబ్ చేసిన సూచన మేరకు డిటెన్షన్ విధానాన్ని కొనసాగించడం వల్ల విద్యార్థులకు ఆ నిర్ణయం శాపంగా మారిందని ఎన్‌జిఓలు అభిప్రాయపడుతున్నాయి. న్యూఢిల్లీలో జరిగిన ఒక ప్రత్యేక సమావేశంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చి అండ్ ట్రైనింగ్, స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా, ఫెడరేషన్ ఆఫ్ ముస్లిం ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ తదితర సంస్థల ప్రతినిధులు కేబ్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. డిటెన్షన్ విధానాన్ని కొనసాగించడం వల్ల నిరుపేద, గ్రామీణ విద్యార్ధులకు ఇబ్బందికరం అవుతుందని వారు పేర్కొన్నారు. 2009 విద్యా హక్కు చట్టం ద్వారా డిటెన్షన్ విధానాన్ని తొలగించిందని, అయితే తర్వాత డిటెన్షన్ విధానాన్ని తిరిగి తీసుకురావడం వల్ల దళిత విద్యార్థులకు నష్టం జరుగుతుందని ప్రొఫెసర్ జానకి రాజన్ అన్నారు. సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చి అండ్ ట్రైనింగ్ సంచాలకుడు తౌసిఫ్ అహ్మద్ మాట్లాడుతూ కేబ్ నిర్ణయాలు విద్యార్ధులను అయోమయంలోకి నెడుతున్నాయని పేర్కొన్నారు.