తెలంగాణ

మురుగు నీటి పథకంలో ప్రణాళికాలోపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 29: మహానగర మంచి నీటి సరఫరా, మురుగు నీటి పారుదల మండలి చేపట్టిన మురుగు నీటి పారుదల బృహత్ పథకం అమలులో ప్రణాళికా లోపం ఉందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తప్పుపట్టింది. నగర పరిధిలోని శేరిలింగంపల్లి మున్సిపాలిటీలో మురుగు నీటి పారుదల బృహత్ పథకంలో భాగంగా అక్కడ నూరు శాతం మురుగు నీటి పారుదల వ్యవస్థను సమకూర్చే సంకల్పంతో హైదరాబాద్ మహానగర మంచి నీటి సరఫరా, మురుగు నీటి పారుదల మండలి (జలమండలి) శేరిలింగంపల్లి మున్సిపల్ సర్కిల్‌లో ఆరు చోట్ల మురుగు నీటి శుద్ధి కేంద్రాలను (ఎస్‌టిపి) నెలకొల్పి ఏడు ప్రాంతాల్లో మురుగు నీటి సమస్యలను పరిష్కరించాలని ప్రతిపాదించింది. 2007 సంవత్సరంలో రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికకు అనుగుణంగా ఈ ప్రతిపాదన చేసింది. దుర్గం చెరువు దగ్గర 5 ఎంఎల్‌డి సామర్థ్యంతో పని చేస్తున్న మురుగు శుద్ధి కేంద్రాన్ని ఈ పథకంలో చేర్చి, జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం ఆర్థిక సాయంతో చేపట్టాల్సి ఉంటుంది. ఇందు కోసం మున్సిపల్ పరిపాలనా, పట్టణాభివృద్ధి శాఖ 200.38 కోట్లకు పాలనాపరమైన మంజూరు చేసి 36 నెలల్లో పూర్తి చేయాలనుకుంది.
బెవర్లీహిల్స్, మియాపూర్, బిహెచ్‌ఇఎల్, కొండాపూర్‌లలోని మూడు క్యాచ్‌మెంట్ ప్రాంతాలు ఎస్‌టిపి పనులకు సంబంధించిన రికార్డులను పరిశీలించినట్లు కాగ్ పేర్కొంది. అయితే మురుగు నీటి శుద్ధి కేంద్రాల చుట్టు పక్కల నివసించే వారి సహకారం తీసుకోకపోవడం, కోర్టు జోక్యం, వ్యాజ్యాల (పిల్) కారణంగా వీటి నిర్మాణంలో ఆలస్యం జరిగింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, సమగ్ర ప్రాజెక్టు నివేదికలకు విరుద్ధంగా పైపులైన్లు వేయడాని కంటే ముందే ఎస్‌టిపి నిర్మాణాలు చేపట్టడం విస్మరించారు. సూరం చెరువు, గోపి చెరువు వద్ద ఎస్‌టిపి నిర్మాణాల కోసం కనీసం స్థల సేకరణ చేయకుండానే లింగంకుంట ఎన్‌టిపి పూర్తి కాకముందే ఈ మూడు ప్రాంతాల మురికి నీటిని తరలించేందుకు బోర్డు పైపు లైన్లు పనులను 83.35 కోట్ల రూపాయల ఖర్చుతో 2007 నుంచి 2014 మధ్య కాలంలో పనులు నిర్వహించడాన్ని కాగ్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
శేర్‌లింగంపల్లి సర్కిల్‌లో మురుగు నీటి పారుదల సదుపాయాలను కేంద్ర ప్రభుత్వ నియమాలకు అనుగుణంగానే చేపట్టినట్లు పేర్కొంది. ఆలస్యాన్ని నివారించే ఉద్దేశ్యంతో పైపు లైన్లు టెండర్లను కూడా ఆరు ఎస్‌టిపి నిర్మాణ పనుల టెండర్లతో పాటే పిలిచామనీ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ స్థలాలను సమకూర్చుతారని భావించి గుత్తేదారులకు పనులు అప్పగించినట్లు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. ప్రభుత్వ వాదన నియమావళికి అనుగుణంగా లేదని కాగ్ పేర్కొంది. పైపు లైన్లు వేసే ముందు చివరి భాగాన ఉన్న నీటి శుద్ధి కేంద్రాల నుంచి పనులు ప్రారంభించాలని నియమావళిలో స్పష్టం చేశారు.