తెలంగాణ

వైభవంగా ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 30: ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలను ఏప్రిల్ 26, 27, 28 తేదీల్లో మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. శతాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై గురువారం సాయంత్రం ఆయన సమీక్ష నిర్వహించారు. శతాబ్ది ఉత్సవాల ప్రారంభ కార్యక్రమానికి రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ వస్తున్నారని, రెండో రోజు పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగరరావు హాజరవుతారని, మూడో రోజు ఆల్ ఇండియా యూనివర్శిటీల విసిల సమావేశానికి కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాష్ జవదేకర్ హాజరవుతారని అన్నారు. సమీక్షా సమావేశంలో ఎంపి కేశవరావు, ప్రభుత్వ సలహాదారు పాపారావు, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, ప్రత్యేక ప్రధానకార్యదర్శి రంజీవ్ ఆచార్య తదితరులు హాజరయ్యారు. శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని, వీటిలో తెలంగాణ జీవన విధానాన్ని ప్రతిబింబించే విధంగా ఆటలు, పాటలు ఉంటాయని అన్నారు. శతాబ్ది ఉత్సవాలకు నిజాం వారసులను, దేశవిదేశాల్లోని ఉస్మానియా పూర్వ విద్యార్ధులను, అధ్యాపకులను ఆహ్వానిస్తున్నామని అన్నారు. ఉస్మానియాలో విద్యాభ్యాసం చేసి వివిధ స్థాయిల్లో గొప్ప గా ఎదిగిన వందమందిని కూడా ఈ ఉత్సవాలకు ఆహ్వానిస్తామని చెప్పా రు. ఈ ఉత్సవాలను ఉస్మానియా యూనివర్శిటీతో పాటు , నిజాం కాలేజీ, ఉమెన్స్ కాలేజీ, సికింద్రాబాద్ కాలేజీ, సైఫాబాద్ కాలేజీ, వరంగల్ ఆర్ట్సు అండ్ సైన్స్ కాలేజీల్లో కూడా నిర్వహిస్తారని, అక్కడ విద్యుదీకరణ చేస్తారని చెప్పారు. ఆల్ ఇండియా విసిల సమావేశంతో పాటు 2018 జనవరి 3వ తేదీన ఆల్ ఇండియా సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు కూడా ఉస్మానియా యూనివర్శిటీ నిర్వహిస్తోందని చెప్పారు. దీనికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరవుతారని చెప్పారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ప్రపంచంలో అందరికీ చేరువయ్యేలా ప్రత్యేక వెబ్‌సైట్ పెట్టి ఆన్‌లైన్‌లో ఆహ్వానాలు పంపుతామని అన్నారు. నగరంలోనూ హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు పెట్టాలని నిర్ణయించినట్టు చెప్పారు. ముఖ్యమంత్రి ఈ ఉత్సవాల సందర్భంగా ఉస్మానియా యూనివర్శిటీకి 200 కోట్లు కేటాయించారని, మెస్ చార్జీలను రద్దు చేశారని, అలాగే మిగిలిన వారికి మెస్ ఛార్జీలను పెంచారని చెప్పారు.

చిత్రం.. శతాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఉస్మానియా విసి ప్రొ.రామచంద్రం, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆచార్య తదితరులు