తెలంగాణ

స్ర్తి నిధిద్వారా రూ.1810 కోట్ల రుణాల మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 30:స్ర్తి నిధి ద్వారా ఈ సంవత్సరం 1810 కోట్ల రూపాయల వరకు రుణాలు మంజూ రు చేయాలని గురువారం జరిగిన సర్వ సభ్య సమావేశంలో నిర్ణయించారు. పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సమావేశంలో పాల్గొన్నారు. 1810 కోట్ల వార్షిక ప్రణాళికకు సమావేశంలో ఆమోదం తెలిపారు. గత సంవత్సరం వచ్చిన లాభంతో మూడు కోట్ల, 48 లక్షల, 16వేల రూపాయల డివిడెండ్‌ను ప్రభుత్వ డివిడెండ్‌గా ఇచ్చారు. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గ్రామీణ ప్రాంతాల్లో 1585 కోట్ల రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో 225 కోట్ల రూపాయల రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. పాడి గేదెల కొనుగోలు కోసం 100 కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. సభ్యుల పిల్లల కోసం సైకిల్ కొనుగోలుతో పాటు స్మార్ట్ఫోన్, ఆటో రిక్షా, ట్రాలీల కొనుగోలుకు సైతం రుణాలు ఇచ్చేందుకు కొత్త పథకాలు ప్రారంభించనున్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యుల కోసం కొత్త ఇన్స్యూరెన్స్ పథకానికి రూపకల్పన చేశారు. ప్రమాద వశాత్తు మరణిస్తే నాలుగు లక్షల రూపాయలు అందించే విధంగా బీమా పథకం అమలు చేస్తారు. మహిళా సంఘాలు అప్పులకే పరిమితం కావద్దని, గ్రామీణాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని మంత్రి జూపల్లి సూచించారు. తీసుకున్న రుణాల్లో 99శాతాన్ని తిరిగి చెల్లిస్తూ ప్రభుత్వ రంగ బ్యాంకుల నమ్మకాన్ని స్ర్తి నిధి పొందటం అభినందనీయమని చెప్పారు. ఎలాగైతే సంఘటితంగా తెలంగాణను సాధించుకున్నామో, అదే స్ఫూర్తితో బంగా రు తెలంగాణ సాధనలో మహిళా సంఘాలు సంఘటితంగా ముందుకు వెళ్లాలని సూచించారు. ఉపాధి హామీ, వ్యక్తిగత మరుగు దొడ్ల నిర్మాణంలోనూ మహిళా సంఘాలు క్రియాశీల పాత్ర పోషించాలని, మహిళా సంఘాల అధ్యక్షుల పదవీ కాలాన్ని పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు. అన్ని సమాఖ్యలకు ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికలు జరిపి కొంత చదువుకున్న వారికి అధ్యక్షురాలిగా అవకాశం కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు జూపల్లి తెలిపారు. గతంతో పోలిస్తే నాలుగింతలు అధికంగా వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నట్టు చెప్పారు. వివిధ పథకాలతో పాటు ఏయే రాష్ట్రాల్లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయో మహిళా సంఘాలకు అవగాహన కల్పించేలా హ్యాండ్ బుక్‌ను రూపొందించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులకు సూచించారు.

చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి జూపల్లి కృష్ణారావు