తెలంగాణ

కొత్త ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 30: రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు గురువా రం శాసనమండలిలో ప్రమాణ స్వీకా రం చేశారు. మైనంపల్లి హనుమం తరావు, గంగాధర్‌గౌడ్, కృష్ణారెడ్డి, జనార్ధన్‌రెడ్డిలతో చైర్మన్ స్వామిగౌడ్ ప్రమాణం చేయంచారు. అనంతరం మైనంపల్లి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కెసిఆర్ వెన్నంటి ఉంటానని, పార్టీ పటిష్టత కోసం పని చేస్తానని అన్నారు. ఉద్యమంలో కష్టపడ్డ అందరికీ ముఖ్యమంత్రి తగిన గుర్తింపు ఇస్తారని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్‌లో టిఆర్‌ఎస్ సభ్యత్వం భారీగా నమోదు అవుతోందని అన్నారు. ఈసారి గ్రేటర్ పరిధిలో 20లక్షల సభ్యత్వం నమోదు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు చెప్పారు. గుడిసెలు లేని హైదరాబాద్‌ను చూడాలనే లక్ష్యం నెరవేరబోతోందని అన్నారు. మిషన్ భగీరథ పథకం కింద ప్రతి ఇంటికీ నీళ్లు ఇవ్వక పోతే ఓట్లు అడగం అని ధైర్యంగా చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ అని అన్నారు.

చిత్రాలు..గురువారం ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్‌ను కలిసిన కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి.. ఆయనతో పాటు ప్రమాణం చేసిన వి.గంగాధర్‌గౌడ్, జనార్ధన్‌రెడ్డి