తెలంగాణ

6 కోట్లు నొక్కేశారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 25: హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీలో నిధుల కుంభకోణం వెలుగుచూసింది. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, ఫోర్జరీ సంతకాలతో 5.8 కోట్ల రూపాయలు కాజేసిన ముఠాను ఈస్ట్‌జోన్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేసి రూ. 30 లక్షల నగదుతోపాటు ఐదు కోట్ల రూపాయల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఈస్ట్‌జోన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డిసిపి రవీందర్ ఈ కుంభకోణం వివరాలు వెల్లడించారు. హెచ్‌ఎండిఏలో ఫీల్డ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న లునావత్ శంకర్ మరో ఇద్దరితో కలిసి సాయి సెక్యూరిటీ సర్వీసెస్ పేరుతో హెచ్‌ఎండిఏకు చెందిన చెక్కులను ఫోర్జరీ చేసి రూ. 1.28 కోట్లు కాజేశాడని చీఫ్ అకౌంటెంట్ ఆఫీసర్ మహమ్మద్ అన్వర్ అహ్మద్ ఈ నెల 15న తార్నాక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఫీల్డ్ ఆఫీసర్ శంకర్ హెచ్‌ఎండిఏలోనే పనిచేస్తున్న విజయ మోహన్ కృష్ణ, రాజా అహ్మద్ అనే ఇద్దరి సహకారంతో5.8 కోట్లు కాజేశారని డిసిపి తెలిపారు. శంకర్ 2008లో ఉద్యోగానికి రాజీనామా చేసి సాయి సెక్యూరిటీ సర్వీసును నెలకొల్పాడు. హెచ్‌ఎండిఏకు సంబంధించిన చెక్కులను ఫోర్జరీ చేస్తూ, నగరంలోని వివిధ బ్యాంకుల్లో ఖాతాలు తెరచి డిపాజిట్ చేశాడు. అదేవిధంగా మరో ఉద్యోగి అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ విజయమోహన్‌కు కొంత ముట్టజెబుతూ వేర్వేరు సెక్యూరిటీ సర్వీసుల పేరిట నకిలీ డాక్యుమెంట్లను తయారు చేసి ఫోర్జరీ సంతకాలతో హెచ్‌ఎండిఏ నిధులను మళ్లిస్తున్నారు. చీఫ్ అకౌంటెంట్ ఆఫీసర్ ఫిర్యాదుతో నకిలీ బాగోతం బయటపడింది. నిందితులు ముగ్గురిని అరెస్టు చేసి విచారించగా అక్రమాలకు పాల్పడినట్టు అంగీకరించారు. కాగా వారి నుంచి సుమారు రూ. 35 లక్షల నగదుతోపాటు బంగారు ఆభరణాలతోపాటు వ్యవసాయ భూములు, ఫ్లాట్లు కొనుగోలు చేసిన రికార్డులను స్వాధీన పరచుకున్నారు. కేసును ఛేదించిన తార్నాక ఇన్‌స్పెక్టర్ అశోక్‌రెడ్డి, ఏసిపి లక్ష్మినారాయణ, సిబ్బందిని డిసిపి రవీందర్ అభినందించారు.

చిత్రం హెచ్‌ఎండిఏ కుంభకోణం వివరాలు వెల్లడిస్తున్న ఈస్ట్‌జోన్ డిసిపి డాక్టర్ రవీందర్