తెలంగాణ

కాంగ్రెస్‌కి ప్రతిపక్ష హోదా సైతం దక్కదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, ఏప్రిల్ 1 : కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని..ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అని.. కాంగ్రెస్ పార్టీ నేతలు కేవలం ఉనికి కోస మే తెలంగాణ సర్కార్‌పై విమర్శలు చేస్తున్నారని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఒక గార్డెన్‌లో సాదాబైనామాలో రైతులకు పట్టాపాస్‌పుస్తకాలు, కల్యాణలక్ష్మి చెక్కులను విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డితో కలసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ అధికారంలో కొనసాగినప్పుడు విద్యుత్, విత్తనాలు, ఎరువులు ఇవ్వలేదని, ప్రాజెక్టులు నిర్మించలేదని, నీరు ఇవ్వలేదని రైతుల గురించి మా ట్లాడే అర్హత ఎక్కడదని ప్రశ్నించారు. ప్రాజెక్టుల నిర్మాణం కోసం సర్కార్ చిత్తశుద్ధితో కృషిచేస్తుంటే కాంగ్రెస్ నేతలు మృతిచెందిన వారి పేర్లతో, ఫోర్జరీ సంతకాలతో కేసులు వేసి ప్రాజెక్టులు అడ్డుకుంటున్నారని దుయ్యపట్టారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు వద్దని కాంగ్రెస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నరని విమర్శించారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే కాంగ్రెస్ నాయకులదే బాధ్యత అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంతో 95 శాతం ప్రయోజనం చేకూరితే 5 శాతం మందికి నష్టం జరుగుతుందని, వారికి మెరుగైన పరిహారం అందిస్తున్న ట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా 30, 45, 70 టిఎంసిల ప్రాజెక్టులు అక్రమంగా నిర్మించిన కాంగ్రెస్ నేతలు నోరు మెదపలేదని విమర్శించారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసిన మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మించి తీరుతామని, గోదావరి జలాలను తీసుకొచ్చి ఈప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. అనంతరం పెద్దలింగారెడ్డి గ్రామస్థులకు సాదాబైనామా పట్టా లు, కల్యాణలక్ష్మి చెక్కులు మంత్రి జగదీశ్‌రెడ్డితో కలసి అందచేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట కలెక్టర్లు వెంకట్రామ్‌రెడ్డి, సురేందర్, జెసి హన్మంత్‌రావు, ఆర్డీఓ ముత్యంరెడ్డి, జడ్పీవైస్ చైర్మన్ సారయ్య, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు