తెలంగాణ

‘గ్రేటర్’లో మీ బలం ఎంత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 15: ‘గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జిహెచ్‌ఎంసి) పరిధిలో మీకు ఉన్న బలం ఎంత?..’ అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి. కిషన్‌రెడ్డి రాష్ట్ర మంత్రి కె. తారక రామారావును ప్రశ్నించారు. జిహెచ్‌ఎంసి పరిధిలో టిఆర్‌ఎస్‌కు ఇద్దరే ఎమ్మెల్యేలు ఉన్నారని ఆయన మంగళవారం విలేఖరుల సమావేశంలో అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ ఐదు స్థానాలను, మిత్రపక్షమైన టిడిపి 9 స్థానాలను కైవసం చేసుకున్నదని ఆయన గుర్తు చేశారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో టిడిపితో కలిసి పోటీ చేస్తామన్నారు. సీట్ల పంపకాల విషయంలో ఈ నెల 18 లేదా 19వ తేదీన టిడిపి ముఖ్య నేతలతో చర్చించనున్నామని ఆయన చెప్పారు. సంక్రాంతి పండుగ సమయంలో జిహెచ్‌ఎంసి ఎన్నికలు నిర్వహిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఫాంహౌస్‌లో కూర్చొని తమకు నీతులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. కరవు ప్రాంతాలను ముఖ్యమంత్రి పర్యటించారా? అని ఆయన ప్రశ్నించారు.

జర్నలిస్టుల సమస్యలపై
22న దీక్షలు... 28న ధర్నాలు

హైదరాబాద్, డిసెంబర్ 15: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడాదిన్నర గడిచినప్పటికీ ఇంతవరకు అక్రిడిటేషన్, హెల్త్ కార్డులు జారీ చేయకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 22నుంచి ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టాలని ఐజెయు, తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ సంయుక్తంగా పిలుపునిచ్చాయి. ఈ నెల 22న రాష్టవ్య్రాప్తంగా జిల్లా కేంద్రాల్లో ఒకరోజు నిరహార దీక్షలు, 28వ తేదీన కలెక్టర్ల ఎదుట ధర్నాలు నిర్వహించాలని ఐజెయు నాయకులు కె శ్రీనివాస్‌రెడ్డి పిలుపునిచ్చారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐజెయు కార్యదర్శి వై నరేందర్‌రెడ్డి, టియుడబ్ల్యుజె రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీతో కలిసి శ్రీనివాస్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడాదిన్నర గడిచినా ఇప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముద్రించిన అక్రిడేషన్ కార్డులు చెలామణి కావడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. హెల్త్ కార్డులను జారీ చేయకపోవడం వల్ల అనారోగ్యం, ప్రమాదాల్లో గాయపడిన కారణంగా సుమారు వంద మంది జర్నలిస్టులు చనిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. అక్రిడేషన్లను అందరికీ ఇస్తామని సిఎం ప్రకటించడమే కాకుండా, ఎన్నికల ప్రణాళికలో కూడా హామీ ఇచ్చిందని శ్రీనివాస్‌రెడ్డి గుర్తుచేశారు. అక్రిడేషన్ల కోసం కమిటీ ఏర్పాటు చేయగా, కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినప్పటికీ రాజధానిలో పనిచేసేవారికి తప్ప ఏ జిల్లాలో ఇంతవరకు అక్రిడేషన్లను జారీ చేయలేదని విమర్శించారు.

తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో
14వరద హెచ్చరిక కేంద్రాలు

హైదరాబాద్, డిసెంబర్ 15: దక్షిణ భారతదేశంలో రానున్న రోజుల్లో భారీ ఎత్తున వరదలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయని అంతర్జాతీయ వాతావరణ కేంద్రం ప్రకటించడంతో కేంద్రం అప్రమత్తమైంది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో నదీ పరివాహక ప్రాంతాల్లో నీటి గమనం తెలుసుకునేందుకు, వర్షపాతం వివరాల నమోదు, అంచనాల నివేదికను తయారుచేసేందుకు కొత్తగా 14 వరద హెచ్చరిక కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర జలవనరుల శాఖ నిర్ణయించింది. ఈ విషయాన్ని రెండు రాష్ట్రప్రభుత్వాలకు తెలిపింది. దశలవారీగా 2017 మార్చిలోపల వరద హెచ్చరిక కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఇ-ఉపరితల జల సమాచార వ్యవస్ధ పరిధి కింద ఈ కేంద్రాలను నెలకొల్పుతారు. రానున్న 72 గంటల్లో వరదలు, భారీ వర్షాలు, నదుల్లో నీటి గమనాన్ని ఆటోమేటిక్ సెన్సార్ ఆధారిత శాటిలైట్ ఆధారిత డాటా, రియల్ టైం వరద పరిస్ధితి, మీడియం రేంజి హైడ్రాలజిక్, హైడ్రాలిక్ మాడ్యూల్స్‌ను సంకలనం చేసి వరద హెచ్చరిక సందేశాలను జారీ చేస్తారు. కామన్ అలెర్టింగ్ ప్రోటోకాల్ వ్యవస్ధను ఉపయోగించుకుంటారు. కేంద్ర జల సంఘం ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. ఆంధ్రాలో ప్రస్తుతం గోదావరి, కృష్ణా, వంశధార బేసిన్లలో వరద పరిస్ధితిని అంచనా వేసే కేంద్రాలున్నాయి. తెలంగాణలో గోదావరి, కృష్ణా నదుల్లో వరద, నీటి గమనాన్ని అంచనావేసే నాలుగు స్టేషన్లు ఉన్నాయి.