తెలంగాణ

ఆధారే ఆధారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 25: రాష్టవ్యాప్తంగా త్వరలో ప్రారంభం కాబోతున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకానికి ఆధార్ కార్డును ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీంతో గతంలో ఎక్కడైనా ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధిపొందినట్టు అయితే డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి తిరిగి దరఖాస్తు చేసుకుంటే తిరస్కరించబడుతుంది. కేవలం తిరస్కరించడమే కాదు, ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఛీటింగ్ కేసు పెట్టే అవకాశం కూడా లేకపోలేదు. ఒకే కుటుంబంలో రెండు మూడేసి రేషన్‌కార్డులతో సబ్సిడీపై నిత్యావసర సరుకులను పొందుతున్నట్టు అయితే ఆ గుట్టును ఆధార్ కార్డు రట్టు చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు అయి ఉండి కూడా ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నట్టు అయితే ఆ విషయాన్ని ఆధార్ కార్డు బహిర్గతం చేస్తుంది. ఉద్యోగస్తులకు ప్రభుత్వం కల్పించిన ఉచిత వైద్య, చికిత్సల కోసం హెల్త్ కార్డులు జారీ చేస్తుంది. ఆరోగ్యశ్రీ కార్డున్న విషయాన్ని గుట్టుగా పెట్టి హెల్త్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నట్టు అయితే చివరకు ఏదో ఒక కార్డునే కొనసాగించి రెండవది రద్దు అవుతుంది. కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ పథకాల కింద ప్రభుత్వం ఇచ్చే డబ్బులను మారు పేర్లతో ఒకటికి రెండుసార్లు కాజేయడానికి ప్రయత్నిస్తే కటకటాలను లెక్కించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తాజాగా ఈ పథకం కింద ఒకటికి రెండుసార్లు లబ్ధి పొందిన వారిని అరెస్టు చేసింది. ఉద్యోగస్తులకు వైద్య, చికిత్సలను ఉచితంగా అందించడానికి ప్రభుత్వం హెల్త్ కార్డులను జారీ చేసింది. వీటిని పొందడానికి దరఖాస్తుకున్న వారికి అంతకుముందే ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నట్టు అయితే హెల్త్ కార్డు పొందడానికి అనర్హునిగా గుర్తిస్తుంది. సబ్సిడీపై ఇచ్చే వంట గ్యాస్ సిలిండర్లను ఆధార్ కార్డుతో సీడింగ్ చేయడంతో కేంద్ర ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అయింది. అయితే సంక్షేమ పథకాలకు ఆధార్ కార్డు తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులతో కొంతకాలం ఇది ఆగిపోయినప్పటికీ తాజాగా ఆధార్ కార్డును తప్పనిసరి చేస్తూ కేంద్రం పార్లమెంట్‌లో చట్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డులను తప్పనిసరి చేయాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ఆదేశాల కంటే ముందు నుంచే తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఆధార్‌కార్డును వర్తింప చేయడంతో కోటి 91 లక్షల ఆహార భద్రతా కార్డులలో 11 లక్షల బోగస్సు కార్డులు ఆధార్ సీడింగ్‌తో బయటపడింది. అలాగే లక్ష 90 వేల నకిలీ ఆధార్ కార్డులు ఉన్నట్టు కూడా బయటపడింది. పంట రుణాల మాఫీలోనూ ఆధార్ కార్డులను సీడింగ్ చేయడంతో ఏకంగా రూ. 1000 కోట్లు ప్రభుత్వానికి ఆదా అయింది. ఆధార్ కార్డుతో పంట రుణ మాఫీని సీడింగ్ చేయకముందు రుణ మాఫీ మొత్తం రూ. 17 వేల కోట్లు కాగా, ఆధార్ సీడింగ్ తర్వాత అది రూ. 16 వేల కోట్లకు చేరుకుని వెయ్యి కోట్లు ఆదా అయింది. ఫీజు రియింబర్స్‌మెంట్, స్కాలర్ షిప్‌లు, కుల ద్రువీకరణ పత్రాల జారీలో ఆధార్ కార్డులను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వాహనాల కొనుగోలులోనూ ఆధార్ కార్డును తప్పనిసరి చేసింది. ఒక్క వాహనం ఉన్నవారి నుంచి లైఫ్ టాక్స్ 12 శాతం వసూలు చేస్తారు. రెండో వాహనం కలిగి ఉంటే 14 శాతం లైఫ్ టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే మొదటి వాహన వివరాలను వెల్లడించకుండా రెండవ వాహనం కొనుగోలు చేసినట్టు అయితే, మిగతా 2 శాతం లైఫ్ టాక్స్ చెల్లించాల్సిందిగా రవాణాశాఖ వాహన యజమానికి నోటీసులు పంపిస్తుంది. ఆధార్ కార్డు ఆధారంగానే ఇది జరుగుతుంది.