తెలంగాణ

ఈ ఏడాది 13 ప్రాజెక్టుల నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 2: సాగునీటి ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా పూర్తి చేయడం ద్వారా అదనంగా కొత్త ఆయకట్టుకు నీరివ్వాలని భావిస్తోంది. రాష్ట్రంలో భారీ, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి కోటి ఎకరాలకు సాగునీటి సౌకర్యాన్ని కల్పించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ముందుకెళుతోంది. దీనిలో భాగంగా తాజాగా ఈ ఆర్థిక సంవత్సరాంతానికి ఏడు భారీ ప్రాజెక్టులు, ఆరు మధ్య తరహా ప్రాజెక్టులను పూర్తి చేసి, తద్వారా 15.62 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగు నీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ భారీ ప్రాజెక్టులు మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, రాజీవ్ బీమా ఎత్తిపోతల, జవహర్-నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, ఎన్‌ఆర్‌ఎస్‌పి-2, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, సింగూరు ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మధ్యతరహా ప్రాజెక్టులుగా చేపట్టిన నీల్వాయ్, గొల్లవాగు, జగన్నాధపూర్ వద్ద పెద్దవాగు, కొమురం భీం ప్రాజెక్టు, కినె్నరసాని కాలువలు, పాలెంవాగు ప్రాజెక్టులను పూర్తి చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకు అనుగుణంగా కల్వకుర్తికి రూ.4896 కోట్లు పరిపాలనాపరమైన అనుమతి మంజూరు చేయగా, ఇప్పటి వరకు రూ.3,381 కోట్లు వ్యయం జరిగింది. రాజీవ్ బీమాకు రూ.2509 కోట్లు మంజూరు కాగా రూ.2288 కోట్లు వ్యయం, నెట్టెంపాడుకు రూ.2331 కోట్లు మంజూరు కాగా రూ.2,027 కోట్లు వ్యయం, కోయిల్‌సాగర్ ఎత్తిపోతలకు రూ.581 కోట్లు కేటాయించగా రూ.465 కోట్లు ఖర్చు చేసింది. ఎన్‌ఆర్‌ఎస్‌పి-2కి రూ.1220 కోట్లు కేటాయించగా, రూ.1065.17 కోట్లు వ్యయం జరగగా, కాళేశ్వరం ఎత్తిపోతలకు రూ.632 కోట్లు పరిపాలక మంజూరు చేయగా ఇప్పటి వరకు రూ.465.99 కోట్లు వ్యయం చేసింది. సింగూరు ప్రాజెక్టుకు రూ.121.67 కోట్లు కేటాయించగా, ఖర్చు చేసింది రూ.120 కోట్లుగా ప్రభుత్వం పేర్కొంది. మధ్యతరహా ప్రాజెక్టులైన నీల్వాయ్‌కు రూ.211.67 కోట్లు పరిపాలన అనుమతి మంజూరు చేయగా, ఇప్పటి వరకు రూ.125 కోట్లు ఖర్చు అయ్యింది. గొల్లవాగు ప్రాజెక్టుకు రూ.107 కోట్లు మంజూరు కాగా, రూ.89.53 కోట్లు ఖర్చు అయ్యింది. జగన్నాధ్‌పూర్ పెద్దవాగు ప్రాజెక్టుకు రూ.246.69 కోట్లు మంజూరు కాగా, దానిలో 105 కోట్లు వ్యయం జరగగా, కొమరంభీం ప్రాజెక్టుకు రూ.882 కోట్లకు గాను రూ.5673 కోట్లు ఖర్చు కాగా, కినె్నరసాని కాలువలకు రూ.36.82 కోట్లు కేటాయించగా రూ.33.59 కోట్లు వ్యయం జరిగింది. పాలెం వాగు ప్రాజెక్టుకు రూ.221 కోట్లు మంజూరు కాగా, ఇప్పటి వరకు రూ.200 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఈ ప్రాజెక్టులకు అదనంగా 2018-19లో భారీ ప్రాజెక్టులైన ఎస్‌ఆర్‌ఎస్‌పి నుంచి ఎఫ్‌ఎఫ్‌సి, జెసిఆర్ డిఎల్‌ఐఎస్, శ్రీపాదసాగర్ ఎల్లంపల్లి ఎత్తిపోతల, చనాకా-కొరటా బ్యారేజీ, మధ్య తరహా ప్రాజెక్టు అయిన లెండి ప్రాజెక్టు, ఇతర ప్రాజెక్టులు ఎంఎంఆర్‌పి ఎస్‌ఎల్‌బిసి, మోడిగుంట వాగు ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. వీటికి తోడు నాగార్జునసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టు ఆధునీకరణ పనులు చేపట్టడం ద్వారా ప్రస్తుతం ఉన్న 8.868 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.