తెలంగాణ

కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 2: విద్యుత్ శాఖలో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేసేందుకు గాను విధివిధానాలు ఖరారు చేసే సమావేశం ఏర్పాటు చేయాలని రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంఘం విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డిని కోరింది. ఆదివారం యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఏ.వజీర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొర్రా వెంకట్‌నాయక్ విద్యుత్ శాఖ మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. మార్చి 30న కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేసేందుకు విధివిధానాలను రూపొందించే సమావేశం నిర్వహించాలని కోరామని, అప్పట్లో జరగని సమావేశం ఇప్పుడు నిర్వహించేందుకు చొరవ తీసుకోవాలని వారు మంత్రిని కోరారు. ఇపిఎఫ్ నుంచి జిపిఎఫ్ సౌకర్యం కల్పించాలని, కెటిపిఎస్ యాష్ పాండ్ నిర్మాణంలో భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు ఉపాధి కల్పించాలని కూడా వారు మంత్రిని కోరారు.