తెలంగాణ

కొన్న చోటే రిజిస్ట్రేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 2: తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ త్వరలో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టనుంది. వాహనాలు కొన్న వారు శాశ్వత రిజిస్ట్రేషన్ నంబర్ కోసం రవాణా శాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. షోరూంలలోనే శాశ్వత రిజిస్ట్రేషన్ నంబర్‌ను కేటాయిస్తారు. ఈ విధానాన్ని వచ్చే జూన్ నుంచి అమలు చేయనున్నారు. తొలి దశలో ప్రయోగాత్మకంగా గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో ఈ విధానాన్ని అమలు చేస్తారు. అనంతరం దశల వారీగా రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు వర్తింపచేస్తారు. ప్రస్తుతం షోరూంలలో వాహనాలు కొనుగోలు చేసిన వెంటనే తాత్కాలిక పద్ధతిలో నంబర్‌ను కేటాయిస్తున్నారు. దీనివల్ల పర్మినెంట్ నంబర్ కోసం వేలాది మంది రవాణా శాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. దీని వల్ల రద్దీ పెరుగుతోంది. మధ్య దళారుల పాత్ర వల్ల అవినీతి కూడా పెరుగుతోంది. షోరూంలలోనే పర్మినెంట్ నెంబర్‌ను ఆన్‌లైన్ పద్ధతిలో కేటాయిస్తారు. ఈ విధానం గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీలో అమలులో ఉంది. కానీ రిజిస్ట్రేషన్ నంబర్ కోసం రవాణా శాఖ కార్యాలయాలకే వెళుదామనుకుంటే ఆ వెసులుబాటును కూడా కల్పించనున్నారు. 2000 సంవత్సరంలో తొలిసారిగా ఆటోమొబైల్ డీలర్లు తాత్కాలిక నంబర్‌ను కొత్తగా వాహనం కొనుగోలు చేసిన వారికి కేటాయించే సదుపాయాన్ని అమలు చేశారు. 2004 వరకు ఈ విధానం మ్యానువల్‌గా ఉండేది. అనంతరం కంప్యూటీకరించారు. ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలో ప్రతి రవాణా శాఖ కార్యాలయంలో ప్రతి రోజూ వంద వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. వాహనదారులు రవాణా శాఖ కార్యాలయానికి వచ్చి గంటల కొద్దీ క్యూలలో నిలబడే విధానానికి స్వస్తి పలికేందుకు వినూత్న విధానాన్ని అమలులోకి తేనున్నట్లు రవాణా శాఖ అధికారి తెలిపారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. 2016 డిసెంబర్ వరకు హైదరాబాద్‌లో అన్ని రకాల వాహనాలు కలిపి 49.10 లక్షలకు పెరిగాయి. 2013లో 38.57 లక్షల వాహనాలు, 2014లో 42.4 లక్షలు, 2015లో 46.15 లక్షల వాహనాలు ఉండేవని రవాణా శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ద్విచక్ర వాహనాలు 35లక్షలు, 8లక్షల కార్లు, 1.3లక్షల ఆటోలు, పదివేల వరకు స్కూలు బస్సులు, 62వేల క్యాబ్‌లు ఉన్నాయి. ఒక్క ఏడాదిలో అంటే 2015 డిసెంబర్ నుంచి 2016 డిసెంబర్ వరకు 1.5 లక్షల వాహనాలు పెరిగాయి.