తెలంగాణ

జనంలోకి వెళ్లండి.. దూకుడు పెంచండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 2: ఉత్తర్‌ప్రదేశ్‌లో బిజెపి సాధించిన ఘన విజ యం ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులను కదిలించింది. దీంతో నగర శివారులోని ఘట్‌కేసర్ మండ లం, అన్నోజిగుడాలో నాలుగు రోజుల పాటు మీడియాకు దూరంగా సమావేశమై పార్టీ భవిష్యత్తుపై వ్యూహరచన చేశారు. రాష్ట్ర పార్టీకి మార్గదర్శనం చేసేందుకు పార్టీ జాతీయ నాయకులూ వచ్చారు. పార్టీ తెలంగాణ శాఖ వ్యవహారాల ఇన్‌ఛార్జీ సౌదాన్‌సింగ్, పార్టీ ఎపి ఇన్‌ఛార్జీ సతీష్ జిగర్, పార్టీ ప్రధాన కార్యదర్శి పి. మురళీధర్ రావు ప్రభృతులు హాజరయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్, పార్టీ శాసనసభాపక్షం నాయకుడు జి. కిషన్‌రెడ్డి, ఇతర ముఖ్య నాయకులూ హాజరై అనేక అంశాలపై చర్చించారు. బిజెపి హైదరాబాద్‌కే పరిమితం కావడం, ఐదుగురు ఎమ్మెల్యేలు ఇక్కడి నుంచే గెలుపొందడం గురిం చి చర్చించారు. పార్టీని హైదరాబాద్ దాటించి మారుమూల గ్రామలకూ తరలించాలని, పోలింగ్ కేంద్రం స్థాయి నుంచి పార్టీని పటిష్టపరిచేందుకు చర్యలు చేపట్టాలని, ఇందుకు పోలింగ్ కేంద్రం స్థాయి నుంచే కమిటీలను ఏర్పాటు చేయాలని వారు సూచించారు. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి పి. మురళీధర్ రావు సమావేశంలో ప్రసంగిస్తూ కమ్యూనిజానికి కాలం చెల్లిపోవడంతో వారు కొత్తగా కులాల పంచాయితీలని విశ్వవిద్యాలయాల్లోకి తెస్తున్నారని విమర్శించారు. కమ్యూనిస్టులు వారి స్వప్రయోజనాలకు పని చేస్తున్నారే తప్ప, అంబేద్కర్ ఆశయ సాధన కోసం కాదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని పేదలందరికీ సంక్షేమ ఫలితాలు అందాలని అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. కొంత మంది వ్యక్తులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను నాయకులు, కార్యకర్తలు ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
పార్టీ శాసనసభాపక్షం నాయకుడు జి. కిషన్‌రెడ్డి ప్రసంగిస్తూ సుపరిపాలన, అవినీతి రహిత పాలన ప్రధాని నరేంద్ర మోదీతోనే సాధ్యమని అన్నారు. 70 ఏళ్ళలో వేసిన రైల్వే లైన్లు, జాతీయ రహదార్లు కంటే ఎక్కువ ఈ మూడేళ్ళలోనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిందని అన్నారు. దీనిపై గణాంకాలతో నిరూపించేందుకు అసెంబ్లీ వేదికగా సిద్ధమని కిషన్ రెడ్డి తెలిపారు.