తెలంగాణ

ఖాళీ ఉద్యోగాలపై శే్వతపత్రం అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 25: ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలపై శే్వతపత్రం విడుదల చేయాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు లేఖ రాశారు. అదేవిధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఉద్యోగ క్యాలెండర్‌ను విడుదల చేసి, ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. టిఆర్‌ఎస్ అధికారం చేపట్టిన ఈ 20 నెలల కాలంలో ఉద్యోగాల భర్తీకి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో యువతలో నైరాశ్యం నెలకొన్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 5 లక్షల ఉద్యోగాల్లో లక్షా ఏడు వేల ఖాళీలు ఉన్నాయని ప్రకటించి, ఇప్పుడేమో 58 వేల ఉద్యోగాలే ఖాళీగా ఉన్నట్లు చెప్పి నిరుద్యోగుల ఆశలపై నీళ్ళు చల్లారని ఆయన విమర్శించారు. గ్రూపు-2లో 18 కేటగిరీలలో ఖాళీలుంటే కేవలం ఐదు కేటగిరీల్లోనే ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారని ఆయన తెలిపారు. కమల్‌నాథన్ కమిటీ నివేదికకు సంబంధం లేకుండా దాదాపు 5 వేల గ్రూపు-2 ఖాళీ ఉద్యోగాలు ఉన్నాయని ఆయన ప్రకటించి, 439 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేశారని ఆయన వివరించారు. ఎక్సైజ్ ఎస్‌ఐ అభ్యర్థుల వయోపరిమితి నిబంధనను సడలించాలని, టిఎస్‌పిఎస్సీ విడుదల చేసిన సిలబస్‌కు ప్రామాణికమైన టెక్ట్స్ బుక్స్ అందుబాటులో లేవని, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బోగస్ సిలబస్‌తో అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కోచింగ్ సెంటర్లపట్ల కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. గ్రూపు-3లో ఉన్న నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ జారీ చేయాలని, ఎస్‌ఐ పరీక్షలో ఇంగ్లీషు మెరిట్ విధానం ఎత్తివేసి ఉద్యోగాల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశరు. ఏప్రిల్‌లోనే ఆర్‌ఆర్‌బి, ఎస్‌ఐ రాత పరీక్షలు ఉన్నందున, గ్రూపు-2 పరీక్ష వాయిదా వేసి ఉద్యోగాల సంఖ్యను పెంచాలని, ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేయాలని లేఖలో డిమాండ్ చేశారు.