తెలంగాణ

చెట్టమ్మా.. నీకు వందనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఏప్రిల్ 2: ‘నలభై ఏళ్ల క్రితం కాల్వకట్టల పక్కన, రోడ్ల వెంబడి తిరుగుతూ మొక్కలు నాటా. ఆనాడు నాటిన మొక్కలే ఈ వృక్షాలు. ఇవే నా నేస్తా లు. మనిషన్నాక ఏదోఒక మంచిపని చేయాలన్న తలంపుతో మొక్కలు నాటడం ఆరంభించా. ఆనాటి నుంచి చేస్తున్న కృషికి ప్రభుత్వం నాకు పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది. ఆ గొప్పతనమంతా ఈ వృక్షాలదే’ అని పద్మశ్రీ పురస్కార గ్రహీత, వనజీవి దరిపల్లి రామయ్య అన్నారు. తాను రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ చేతులమీదుగా అందుకున్న పద్మశ్రీ పురస్కారాన్ని చెట్లకు చూపించి వందనాలు తెలుపుకున్నారు. ఢిల్లీలోని రాష్టప్రతి భవన్‌లో రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ చేతులమీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఆదివారం ఆయన విలేఖరులకు చెప్పారు. ఒక సామాన్యుడినైన తనకు పురస్కారం వచ్చిందంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నానన్నారు. పురస్కారం కోసం ఖమ్మం నుంచి ఢిల్లీ వెళ్ల డం, స్వీకరించడం, తాను నాటిన చెట్లకే చూపించడం వంటి అంశాలను ఎన్నటికీ మరువలేనన్నారు. ఈ పురస్కారంతో తనపై మరింత బాధ్యత, పట్టుదల పెరిగిందన్నారు. భారత ప్రభుత్వం కరెన్సీపై వన చిత్రాలను ముద్రించడం వల్ల చదువురాని గొర్రెల కాపరులైనా, అమెరికాలోని తెలుగు రాని మన తెలుగువారికైనా మొక్కల పెంపకం ఆవశ్యకత తెలిసివస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తన కు అన్నివిధాలా సహకరిస్తే శక్తిసామర్థ్యాలను కూడగట్టుకొని మొక్కలు నాటేందుకు, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని దరిపల్లి రామయ్య వినమ్రంగా ప్రకటించారు.