తెలంగాణ

న్యాయం కోసం ఎంతకాలం ఆగాలి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/నల్లకుంట, మార్చి 25: తన కొడుకు ఆత్మహత్యకు కారకుడైన హెచ్‌సియు విసి అప్పారావును తక్షణమే అరెస్టు చేయాలని రోహిత్ తల్లి రాధిక డిమాండ్ చేశారు. శుక్రవారం హైదర్‌గూడ ఎన్‌ఎస్‌ఎస్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ విసి అప్పారావుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి 2 నెలలు గడిచినా దర్యాప్తు ఎందుకు జరగడంలేదని ఆమె ఆరోపించారు. తన బిడ్డ మృతిచెంది చాలా కాలం అయిందని తమకు ఇప్పటికీ న్యాయం జరగలేదని, న్యాయం కోసం ఇంకా ఎంతకాలం వేచిచూడాలని ఆమె ప్రశ్నించారు. తనకు న్యాయం చేసే ఆలోచన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని ఆమె ఆరోపించారు. తమకు అండగా నిలిచిన హెచ్‌సియు విద్యార్ధులపై పోలీసులు అక్రమ కేసులను ఉపసంహరించుకుని అరెస్టు చేసిన విద్యార్ధులను విడుదల చేయలని డిమాండ్ చేశారు. కెసిఆర్ ప్రభుత్వం నిందితులకు బందోబస్తు నిర్వహిస్తూ విద్యార్థులపై పోలీసులను ఉసిగొల్పుతోందని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితులకు ఒక న్యాయం, ఆగ్రవర్ణాలవారికి మరోన్యాయం చేస్తున్నాయన్నారు. రోహిత్ తమ్ముడు రాజు మాట్లాడుతూ తన అన్నయ్య చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రెండు నెలలు గడిచినా కేసులో ఎలాంటి మార్పులేదని వాపోయారు. ఎబివిపి అండదండలతో యూనివర్సిటీ విసి అప్పారావు చెలరేగిపోతున్నారని, తన అన్నయ్య మృతికి కారణమైన అప్పారావుకు పోలీసులు బందోబస్తు నిర్వహించడం సిగ్గుచేటన్నారు. హెచ్‌సియు యూనివర్సిటీలో విద్యార్థులకు రక్షణ కరువైందన్నారు.