తెలంగాణ

నగర పంచాయతీల అభివృద్ధికి ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 25: నగర పంచాయితీల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించనున్నట్టు సిఎం కె చంద్రశేఖర్ రావు ప్రకటించారు. స్వయం సమృద్ధి నగరాలుగా నగర పంచాయితీలను అభివృద్ధి చేయనున్నట్టు వెల్లడించారు. నగరాలతో సమానంగా గ్రామాలు, పంచాయితీలు అభివృద్ధి చెందాలని, పౌర సౌకర్యాలు ఉండాలని అన్నారు. దీనికి ప్రజాప్రతినిధులు కృషి చేయాల్సిన అవసరం ఉందని సిఎం పేర్కొన్నారు. మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్, తెదేపాలకు చెందిన పలువురు నాయకులు తెరాస పార్టీలో చేరారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వారిని ఉద్దేశించి సిఎం మాట్లాడారు. బడంగిపేట నగర పంచాయితీ చైర్మన్ సామా నరసింహాగౌడ్‌తోపాటు పలువురు కౌన్సిలర్లు, ఎంపిటిసిలకు కెసిఆర్ గులాబీ కండువాకప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. బడంగిపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్టు చెప్పారు. కాంగ్రెస్ కౌన్సిలర్లు సమ్మిరెడ్డి స్వప్న, అంబోతు దశరథ, యాదగిరి, టిడిపి స్థానిక కమిటీ అధ్యక్షుడు రాళ్లబండి కుమార్, సరూర్‌నగర్ ఎంపిపి విక్రంరెడ్డి, ఎంపిటీసి రాజేశ్వర్, రవి తెరాసలో చేరినవారిలో ఉన్నారు.