తెలంగాణ

లారీల సమ్మె ఉద్ధృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 3: ట్రాన్స్‌పోర్టు సంఘాలతో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఐఆర్‌డిఏ) సోమవారం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో లారీల సమ్మె మరింత ఉద్ధృతమైంది. సోమవారం పలు ప్రాంతాల్లో లారీ యజమానులు, డ్రైవర్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. రాస్తారోకో, వంటావార్పుతో నిరసనలు వ్యక్తం చేశారు. ఈనెల 8వ తేదీ లోగా తమ డిమాండ్లు పరిష్కరించని పక్షంలో దేశవ్యాప్తంగా సమ్మె చేపడతామని ఆలిండియా మోటార్స్ ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్‌కె సింగ్, దక్షిణాది రాష్ట్రాల శాఖ చైర్మన్, హైదరాబాద్ గూడ్స్ ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్ అధ్యక్షుడు ఎకె అగర్వాల్ ప్రకటించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ‘చక్‌బ్రంద్’ పేరుతో ట్రాన్స్‌పోర్టర్ల సమ్మెను ప్రారంభిస్తామన్నారు. కాగా రవాణా వాహనాలకు స్పీడ్ గవర్నెన్స్ ఏర్పాటు నిబంధనలు ఉపసంహరించుకోవాలని, పెంచిన నారీ చలానా ఫీజులు, జరిమానాలు రద్దు చేయాలని కోరుతూ దక్షిణాది రాష్ట్రాల లారీ యజమానులు చేపట్టిన సమ్మె ఐదోరోజుకు చేరింది. దీంతో ఎక్కడివాహనలు అక్కడ నిలిచిపోగా నిత్యావసర వస్తువుల ఎగుమతులు, దిగుమతులు స్తంభించిపోయాయి. సౌత్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలలో లారీల సమ్మె కొనసాగుతోంది. కాగా లారీ యజమానులతో తెలంగాణ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించినప్పటికీ అసోసియేషన్ ప్రతినిధులు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. సమ్మె చేపట్టి ఐదు రోజులు అవుతున్నా..ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించి, తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించలేదని తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. చర్చలు వద్దు..సమస్యలు పరిష్కరించాలని అసోసియేషన్ డిమాండ్ చేసింది. కాగా సోమవారం హైదరాబాద్ నగర శివారులో పలు ప్రాంతాల నుంచి సరుకుల రవాణా చేసేందుకు యత్నించిన డిసిఎంలు, ట్రాలీలలను అసోసియేషన్ ప్రతినిధులు అడ్డుకున్నారు. ప్రభుత్వం భారీగా పెంచిన బీమా ప్రీమియాన్ని తగ్గించాలని, సింగిల్ పర్మిట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని, టోల్‌గేట్ టాక్స్‌ను తగ్గించాలని లారీ యజమానులు డిమాండ్ చేశారు. లారీల సమ్మెతో ఇప్పటికే మహరాష్టల్రో పది వేలకు పైగా లారీలు నిలిచిపోయాయి. దీంతో ఆ రాష్ట్రం నుంచి సరఫరా అయ్యే క్యాబేజి, ఉల్లి, ఆలుగడ్డ రవాణా నిలిచిపోయింది. అదేవిధంగా సిమెంటు, స్టీలు, ఇసుక వంటి రవాణా పూర్తిగా నిలిచిపోయింది. ఇప్పటి వరకు అత్యవసర రవాణాకు అనుమతించిన లారీ ఓనర్స్ అసోసియేషన్ సోమవారం నుంచి అత్యవసర రవాణాను కూడా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికైనా ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందిస్తూ, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎన్ భాస్కర్‌రెడ్డి, బి దుర్గప్రసాద్ డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో ఈనెల 8 నుంచి దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టాలని దక్షిణాది రాష్ట్రాల సంఘాల పిలుపునిచ్చాయని వారు తెలిపారు. ఈ మేరకు తమ సమ్మెను మరింత ఉద్ధృతం చేయనున్నట్టు చెప్పారు. ఇదిలావుండగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించిన ప్రభుత్వం నిత్యావసర, అత్యవసర వస్తువుల రవాణాకు ఆర్టీసి బస్సులు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న ఆలిండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్‌కె సింగ్ తదితరులు