తెలంగాణ

రికార్డు స్థాయిలో వరి పంట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 4: యాసంగిలో రికార్డు స్థాయిలో వరి పంట పండింది. 37లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది. 2015-16 రబీలో 1286కొనుగోలు కేంద్రాల ద్వారా 8.42లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా ఈసారి నాలుగింతల దిగిబడి పెరిగింది. ధాన్యం ఏ గ్రేడు క్వింటాలు 1510, సాధారణ రకం క్వింటాలు 1470 రూపాయల ధర చొప్పున కొనుగోలు చేస్తారు. మొత్తం 3076 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తారు.
యాసంగి ధాన్యం సేకరణపై పౌర సరఫరాల శాఖ కమీషనర్ సివి ఆనంద్ అధికారులతో మంగళవారం సమీక్ష జరిపారు. ఐకెపి కేంద్రాలు 1101, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు 1771, ఎసిఎంఎస్, ఐటిడిఎ ఆధ్వర్యంలో 204 మొత్తం 3076 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తారు. వచ్చే వారం నుంచి కొనుగోలు ప్రారంభం అవుతుంది. ఏప్రిల్‌లో 11.35 లక్షల మెట్రిక్ టన్నులు, మే నెలలో 18.92 లక్షల మెట్రిక్ టన్నులు, జూన్‌లో 7.57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని అంచనా వేశారు. గోదాముల నిల్వ సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఐదు కిలో మీటర్లకు ఓక ధాన్యం కొనుగోలు కేంద్రం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. మే, జూన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు పడే అవకాశాలు ఉంటాయని, వీటిని దృష్టిలో పెట్టుకొని వీలైన ప్రతి చోట స్టోరేజీ కోసం పాఠశాలలను ఉపయోగించుకోవాలని క్షేత్ర స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తేమ కొలిచే యంత్రాలు, టార్పాలిన్‌లు వంటివి సమకూర్చుకుంటున్నారు.
ధాన్యం సేకరణ కమిటీలు
జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా జిల్లా స్థాయిలో దాన్య సేకరణ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్టు పౌరసరఫరాల శాఖ కమిషనర్ తెలిపారు. ఈ కమిటీలో వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాలు, రవాణా, డిఆర్‌డిఎ, ఐటిడిఎ, ఎఫ్‌సిఐ, ఎస్‌డబ్ల్యుసి, సిడబ్ల్యుసి విభాగాల జిల్లా స్థాయి అధికారులు సభ్యులుగా ఉంటారు. దాన్యం రవాణా, పర్యవేక్షణ, మద్ధతు ధర, ఇతర ఫిర్యాదులకు సంబంధించి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తారు. ధాన్య సేకరణకు అవసరం అయిన గన్నీ బ్యాగులను సేకరించారు. మద్దతు ధర ఏ గ్రేడ్‌కు క్వింటాలుకు 1510, సాధారణ రకంకు 1470కి తగ్గకుండా రైతులకు చెల్లించే విధంగా చూస్తారు.