తెలంగాణ

ఆంధ్రాబ్యాంక్‌లో చోరీకి విఫలయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 25: నగరంలోని ఆంధ్రాబ్యాంకులో చోరీకి విఫలయత్నం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున చిక్కడపల్లిలోని ఆంధ్రాబ్యాంక్‌ను దుండగులు దోచుకునేందుకు విఫలయత్నం చేశారు. బ్యాంక్ వెనుక భాగాన గోడకు రంద్రం వేసి బ్యాంకులోకి వెళ్లిన దుండగులు స్ట్రాంగ్ రూమ్ తెరిచేందుకు ప్రయత్నించారు. అలారమ్ మోగడంతో దుండగలు పారిపోయారు. కాగా ఉదయం వాకింగ్ వెళ్తున్న కొందరు వ్యక్తులు బ్యాంక్ గోడకు కన్నం వేసిన ఉండడాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే చిక్కడపల్లి పోలీసులు అక్కడకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. బ్యాంక్ అధికారులు పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రదేశంలో దుండగులు చోరీకి యత్నించడం పాత నేరస్థుల పనేనని సెంట్రల్ జోన్ డిసిపి కమలాసన్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. త్వరలోనే దుండగులను పట్టుకుంటామని డిసిపి చెప్పారు.
కాగా, నగరంలోని 14 బ్యాంకులకు చెందిన ఏటిఎంలలో 130కి పైగా బ్యాటరీలు చోరీకి గురయ్యాయని, బ్యాటరీల చోరీ కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్టు నారాయణగూడ ఇనె్స్పక్టర్ బీమారెడ్డి తెలిపారు. ఏటిఎంల వద్ద సెక్యూరిటీ లేకపోవడం వల్లే చోరీలు జరుగుతున్నాయని, ఏటిఎంల వద్ద బ్యాంకర్లు సెక్యూరిటీని నియమించుకోవాలని ఆయన సూచించారు.