తెలంగాణ

బస్టాండ్లలో మంచినీళ్లివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 4: ప్రయాణీకులకు ఆర్టీసి బస్టాండ్లలో కనీస మంచి నీటి సదుపాయాన్ని కల్పించడం టిఎస్‌ఆర్టీసి బాధ్యతని, కరీంనగర్ ఆర్టీసి బస్టాండ్‌లో మంచి నీటి సదుపాయంపై అఫిడవిట్‌ను దాఖలు చేయాలని హైకోర్టు టిఎస్‌ఆర్టీసిని ఆదేశించింది. తెలంగాణ సిటిజన్స్ సంక్షఏమ సంఘం దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించింది. బస్టాండ్‌లో మెసర్స్ బిస్లిరీ ఇంటర్నేషనల్ సంస్ధ వాటర్‌బాటిల్స్‌ను మాత్రమే విక్రయించాలని ఆర్టీసి యాజమాన్యం 2016 ఫిబ్రవరి 19వ తేదీన ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఈ చర్య చట్టవిరుద్ధమని పిల్‌ను దాఖలు చేసిన సంస్ధ పేర్కొంది. ప్రతి ఒక్కరు మంచినీటి బాటిల్స్‌ను కొనుగోలు చేసే శక్తి ఉండదని హైకోర్టు పేర్కొంది. కనీసం పబ్లిక్ నల్లా కూడాబస్టాండ్‌లో లేదని పిటిషనర్ తరఫున న్యాయవాది తెలిపారు. అనంతరం హైకోర్టు మంచినీటి సదుపాయాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.