తెలంగాణ

విద్యార్థులను విడుదల చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 25: కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థులతో హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం ఎమ్మెల్యే బలాల ములాఖత్ అయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం వీరు చర్లపల్లి జైలులో వున్న విద్యార్థులను కలిసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 22న హెచ్‌సియూలో జరిగిన సంఘటన దురదృష్టకరమన్నారు. విద్యార్థుల స్వేచ్ఛను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని, విద్యార్థులు, విశ్వవిద్యాలయాల పట్ల బిజెపి ప్రభుత్వం నిరంకుశ ధోరణి అవలంబిస్తోందని, జైల్లోవున్న విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్‌లలో ఈ విషయాన్ని ప్రస్తావించనున్నట్టు ఎంపి అసదుద్దీన్ తెలిపారు. చర్లపల్లి నుంచి వెనుతిరిగి వెళ్తున్న అసద్‌ను ఉద్దేశించి ‘్భరత్ మాతాకి జై..’ అంటూ ఎన్‌ఎస్‌యుఐ విద్యార్థులు నినాదాలు చేశారు.
ఈ నెల 22న హెచ్‌సియూ విద్యార్థులను అరెస్టు చేసి చర్లపల్లి జైలులో పెట్టడం విచారకరమని, ఇద్దరు ప్రొఫెసర్లు, 28 మంది విద్యార్థులను బేషరుతుగా వెంటనే విడుదల చేయాలని ప్రొఫెసర్లు డిమాండ్ చేశారు. హెచ్‌సియూ నుంచి పోలీసు బలగాలు వెళ్లిపోవాలని, 22న జరిగిన సంఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.