తెలంగాణ

జగ్జీవన్‌రాం బాటలో నడుద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 5: భారతదేశ దివంగత ఉపప్రధాని బాబూ జగ్జీవన్‌రాం వేసిన బాటలో నడుద్దామని తెలంగాణ రాష్ట్ర ఎస్‌సి అభివృద్ధి మంత్రి, జగ్జీవన్‌రాం జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ జి.జగదీశ్వర్‌రెడ్డి పిలుపు ఇచ్చారు. జగ్జీవన్‌రాం 110వ జయంతిని పురస్కరించుకుని ఎల్‌బి స్టేడియం వద్ద ఉన్న జగ్జీవన్‌రాం విగ్రహానికి ఆయన బుధవారం పూలమాల వేసి నివాళులు అర్పించారు. రాష్ట్ర రాజధానితో పాటు తెలంగాణలోని 31 జిల్లాల్లో, డివిజన్ కేంద్రాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో జగ్జీవన్‌రాం జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్‌లో జరిగిన ప్రధాన కార్యక్రమంలో మంత్రి జగదీశ్వర్‌రెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, ఉపప్రధానిగా, రక్షణ మంత్రిగా జగ్జీవన్‌రాం దేశానికి ఎనలేని సేవలు అందించారన్నారు. జగ్జీవన్ చూపిన మార్గాన్ని ఆదర్శంగా తీసుకుని తమ ప్రభుత్వం ఎస్‌సి, ఎస్‌టిల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తోందన్నారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు మెస్ చార్జీలను 29 శాతం నుండి 120 శాతం వరకు పెంచామని, కల్యాణలక్ష్మి పథకం కింద పెళ్లికోసం వధువుకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని 51 వేల రూపాయల నుండి 75,116 రూపాయలకు పెంచామన్నారు. దీనివల్ల పేదల గృహాల్లో ఆనందం తాండవిస్తోందన్నారు. 268 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలను ప్రారంభించి కార్పోరేట్ విద్యాసంస్థలకు ధీటుగా నడిపిస్తున్నామన్నారు. జగ్జీవన్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించిన వారిలో ఎమ్మెల్సీ రామచందర్‌రావు, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎమ్మెల్యేలు రామచంద్రారెడ్డి, రమణ, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్‌రెడ్డి, ఎస్‌సి గురుకుల పాఠళాలల కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు తదితరులు ఉన్నారు.

బాబూ జగ్జీవన్‌రాం జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న టిడిపి, కాంగ్రెస్, బిజెపి నేతలు. జగ్జీవన్‌రాం చిత్రపటానికి నివాళులర్పిస్తున్న మంత్రి జగదీశ్ రెడ్డి