తెలంగాణ

ఆత్మహత్యల్లో ఐదో స్థానం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 5: మానసిక కృంగుబాటు, క్షణికావేశంతో ఆత్మహత్యలకు పాల్పడడం రోజురోజుకూ పెరుగుతున్నది. దీనికి ప్రభుత్వాలు తమ వంతు బాధ్యతగా స్పందించి, నివారణకు కృషి చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్ధలు కోరుతున్నాయి. ఇక మన దేశంలో జరుగుతున్న ఆత్మహత్యల్లో తెలంగాణ రాష్ట్రం ఐదవ స్థానంలో నిలుచోవడం ఆందోళన కలిగిస్తున్నది. శుక్రవారం (7న) ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ సంస్థలు మానసిక కృంగుబాటును ఎదుర్కొనేందుకు సమాయత్తం కావాలంటూ పిలుపునిచ్చాయి. ఇండియన్ నేషనల్ క్రైం బ్యూరో (2014) రికార్డుల ప్రకారం తెలంగాణలో ఆత్మహత్యల రేటు 26.5గా ఉంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 40 సెకన్లకు ఒకరు మానసిక కృంగుబాటుతో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. దేశంలోనూ 2020 నాటికి ప్రతి 10 మంది లో ఇద్దరు మానసిక కృంగుబాటుకు గుర య్యే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వం అంఛనా వేస్తోంది. మానసిక ఒత్తిడి, నిద్రలేమి, తెల్లవారుజామున మెలుకవ రావ డం, శరీరంలో నొప్పులు, అజీ ర్ణం, వివిధ రకాల అనారోగ్యం, శరీరంలో శక్తి లోపించడం, సరైన విశ్రాంతి లేకపోవడం, కుటుంబ సమస్యలు అనేక ఒత్తిళ్ళ కారణాలతో ఆత్మహత్యలకు దారి తీస్తున్నది.
ఆరోగ్యమే అసలైన సంపద
ఆరోగ్యమే అసలైన సంపద అని ప్రజల్లో చైతన్యం పెరగాల్సి ఉందని సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రి సీనియర్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. మానసిక కృంగుబాటు వ్యక్తిని నిస్సహాయుడిగా, తనను తాను నిరర్థకుడిగా పరిగణించుకునే వాడిగా, బతుకు భారంగా కనిపించి వేదనలో మునిగిపోయి చివరకు ఆత్మహత్యలకు దారి తీస్తున్నదని డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు.

జీవన వేగంలో పడి ఆరోగ్యం దెబ్బతినక ముందే జాగ్రత్త పడాలని ఆయన సూచించారు. వత్తిడిని జయించడం సులభమేనని ఆయన తెలిపారు. 6 నుంచి 9 గంటల నిద్ర, వ్యాయామంతో ఆరోగ్యకరమైన జీవితం గడపవచ్చని ఆయన వివరించారు. అంతేకాకుండా బాధాకరమైన అనుభవాల నుంచి బయటపడేందుకూ ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నుంచి అలవాట్లు, ఆచరణ మార్చుకోవాలని ఆయన కోరారు.