తెలంగాణ

నియంతృత్వ వైఖరితో భయోత్పాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 25: ప్రజాస్వామ్యంలో తమ హక్కులకోసం న్యాయంగా పోరాటం చేస్తున్న దళిత, బహుజన విద్యార్థులపట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియంతృత్వంగా వ్యవహరిస్తున్నాయని, విశ్వ విద్యాలయాలను పోలీసు క్యాంపులుగా మారుస్తూ భయభ్రాంతులను చేస్తున్నాయని టి.పిసిసి అధ్యక్షుడ ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. నగర శివారులోని చర్లపల్లి జైలులో ఉన్న హెచ్‌సియు విద్యార్థులను, అధ్యాపకులను ఆయన కలిసి సంఘీభావం ప్రకటించారు. ఆయన వెంట టి.పిసిసి ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్, ఎన్‌ఎస్‌యుఐ అధ్యక్షుడు బి. వెంకట్ తదితరులు ఉన్నారు.
అనంతరం ఉత్తమ్‌కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి సారధ్యంలోని ప్రభుత్వం, రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నాయని విమర్శించారు. విశ్వవిద్యాలయాల్లో అశాంతికి ప్రభుత్వాలే ఆజ్యం పోస్తున్నాయని ఆయన విమర్శించారు. హెచ్‌సియు వైస్-్ఛన్సలర్ అప్పారావుపై ఎస్‌సి, ఎస్‌టి కేసు ఉన్న విషయం తెలిసి కూడా పాలకులు ఆయన తిరిగి బాధ్యతలు చేపట్టేందుకు అనుమతించడం విస్మయం కలిగించిందని ఆయన తెలిపారు.
విసి అప్పారావును వెంటనే అరెస్టు చేసి వర్సిటీలో శాంతిభద్రతలు నెలకొల్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పాలన కొరవడిందని, హక్కులను రాలరాస్తూ ఒక నియంత పాలన కొనసాగిస్తున్నారని ఆయన విమర్శించారు.