బిజినెస్

భారత్‌లో ఉన్నవారికే ఐటిఆర్‌కు ఆధార్ తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి

(2017-18)గాను ఆదాయ పన్ను రిటర్న్స్ (ఐటిఆర్)

దాఖలు కోసం పన్ను చెల్లింపుదారులు ఆధార్ కార్డు

లేదా ఎన్‌రోల్‌మెంట్ ఐడి తప్పనిసరిగా

సమర్పించాలన్న నియమం కేవలం దేశంలో

ఉంటున్నవారికే వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం

బుధవారం స్పష్టం చేసింది. ఆర్థిక చట్టం 2017 ప్రకారం

ఐటిఆర్ దాఖలుకు ఆధార్ లేదా ఎన్‌రోల్‌మెంట్

ఐడిని పన్ను చెల్లింపుదారులు తప్పక పేర్కొనాల్సి

ఉంటుంది. ఈ క్రమంలోనే రెసిడెంట్ ఇండియన్స్‌కు

మాత్రమే ఇది వర్తిస్తుందని కేంద్రం తెలిపింది. ఇకపోతే

ఈ ఏడాది జూలై 1 నుంచి శాశ్వత ఖాతా నెంబరు

(పాన్ కార్డు) కోసం దరఖాస్తు చేసుకున్నవారికీ

ఆధార్ తప్పనిసరిగా ఉండాల్సిందే.
ఇదిలావుంటే 2 లక్షల రూపాయలను మించి నగదు

లావాదేవీలపై నిషేధం.. బ్యాంక్, పోస్ట్ఫాస్ సేవింగ్స్

ఖాతాల నుంచి చేసే నగదు ఉపసంహరణలకు

వర్తించదని ఆదాయ పన్ను శాఖ తెలిపింది. ఆర్థిక

చట్టం 2017 ప్రకారం 2 లక్షల రూపాయలను మించి

చేసే నగదు లావాదేవీలను కేంద్ర ప్రభుత్వం

నిషేధించింది. అయితే ఈ నిషేధం బ్యాంక్, తపాలా

శాఖల్లోని పొదుపు ఖాతాల నుంచి జరిగే నగదు

ఉపసంహరణలకు వర్తించదని ఆదాయ పన్ను శాఖ

తాజాగా చెప్పింది.

ముడి చక్కెర దిగుమతులకు
పన్ను మినహాయంపు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: దేశీయంగా చక్కెర ఉత్పత్తి

క్షీణించిన నేపథ్యంలో మార్కెట్‌లో ధరల

అదుపునకు, సరఫరా పెంపునకు ఊతమివ్వడంలో

భాగంగా విదేశాల నుంచి చేసుకున్న ముడి చక్కెర

దిగుమతుల్లో 5 లక్షల టన్నుల వరకు సుంకాలు

విధించబోమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే

టారీఫ్ రేట్ కోటా (టిఆర్‌క్యు) క్రింద ఈ ఏడాది జూన్

12 వరకే ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ

క్రమంలో దీనికి సంబంధించి ఈ నెల 13 నుంచి 24

మధ్య డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డిజిఎఫ్‌టి)

వద్ద ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకోవాలని రిఫైనర్లకు

ఆహార మంత్రి పాశ్వాణ్ సూచించారు.