తెలంగాణ

బాల్య వివాహాలకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దఅడిశర్లపల్లి/ డిండి/ యైటింక్లయిన్‌కాలనీ, మార్చి 25: కరీంనగర్, నల్లగొండ జిల్లాలోని పలు మండలాల్లో జరుగబోయే బాల్య వివాహాలను అధికారులు అడ్డుకున్నారు. పెద్దఅడిశర్లపల్లి మండలం పొల్కంపల్లి పంచాయతీ మాదాపురం తండాలో శుక్రవారం జరగనున్న బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. చందంపేట మండలం చిత్రియాల పంచాయతీ బుడ్డోని తండాకు చెందిన మోడావత్ పంత్యా, సరోజల కుమార్తె, 14 సంవత్సరాల సంజును మండలంలోని చేతినేనిపల్లికి చెందిన వ్యక్తికి ఇచ్చి శుక్రవారం వివాహం చేసేందుకు కుంటుంబ సభ్యులు నిశ్చయించారు. అయతే, బాల్య వివాహం జరుగుతుందని తెలుసుకున్న ఐసిడిఎస్ పోలీసు అధికారులు ఉదయానే్న మాదాపురం తండాకు చేరుకుని అబ్బాయి తరపు వారు రాకముందే అమ్మాయి తల్లిదండ్రులకు కౌనె్సలింగ్ నిర్వహించి వివాహాన్ని నిలిపివేశారు.
డిండి మండలంలో....
మండలంలోని కందుకూర్ గ్రామంలో శుక్రవారం జరగాల్సిన బాల్య వివాహాన్ని దేవరకొండ సిడిపివో సక్కుబాయి అడ్డుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని రహలమంతాపూర్ గ్రామానికి చెందిన వేముల తిరుపతయ్య, లక్ష్మమ్మ దంపతుల కుమార్తె అఖిలకు మేనత్త కుమారుడైన మహబూబ్‌నగర్ జిల్లా గట్టి ఇప్పలపల్లి గ్రామానికి చెందిన డేరింగుల సురేశ్ (20)తో శుక్రవారం వివాహం జరిపించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అఖిల రహమంతాపూర్ పాఠశాలలో 9 వ తరగతి చదువుతోంది. ఈ విషయమై ఎస్‌ఐ శేఖర్‌కు సమాచారం అందడంతో వెంటనే సిడిపివో సక్కుబాయికి తెలియజేశారు. దీంతో సిడిపివో ఇరు కుటుంబాలకు బాల్య వివాహం చేయడం వల్ల జరిగే అనర్ధాల గురించి వివరించారు. సిడిపివో ఇరు కుటుంబాలతో ఇద్దరు మేజర్లు అయ్యే వరకు వివాహం జరిపించబోమని కాగితాలు రాయించుకుని బాల్యవివాహం జరుగకుండా అడ్డుకున్నారు.
యైటింక్లయిన్‌కాలనీలో...
పిన్న వయస్సులోనే పెళ్ళి చేయడానికి సిద్ధమైన తల్లితండ్రులను కౌనె్సలింగ్ నిర్వహించి, వివాహాన్ని అడ్డుకున్న సంఘటన కరీంనగర్ జిల్లా గోదావరిఖని టు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్లూర్ గ్రామంలో జరిగింది. ఒక సామాజిక వర్గానికి చెందిన 13 సంవత్సరాల చిన్నారి 7వ తరగతి చదువుచుండగా, తల్లిదండ్రులు గురువారం రాత్రి పెళ్ళి చేసేందుకు గుండారం గ్రామానికి చెందిన పెళ్ళి కొడుకు బంధువులు చేరుకోగా విషయం తెలుసుకున్న సిపిడివో సంధ్యారాణి, గ్రామ పోలీస్ అధికారి ఆంధ్రయ్యతో పాటు పలువురు పెండ్లి మండపం వద్ద చేరుకొని చిన్నారి తల్లిదండ్రులు జన్నయ్య, సారయ్యలకు సూచించారు. అయతే, రాత్రి పెండ్లి చేయకుండా ఆపివేసి, మళ్ళీ శుక్రవారం ఉదయం పెళ్ళి చేసేందుకు తల్లితండ్రులు సిద్ధమయ్యారు.
దీంతో గోదావరిఖని టు టౌన్ సిఐ చల్లా దేవారెడ్డి, ఎస్‌ఐ ప్రదీప్ కుమార్ పెళ్లి మండపం వద్దకు చేరుకొని ఇరువురి తల్లిదండ్రులకు మరోసారి కౌనె్సలింగ్ నిర్వహించి పెండ్లిని అడ్డుకున్నారు.