తెలంగాణ

పెండింగ్ పనులు పూర్తి కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 8: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న అన్ని పెండింగ్ పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ ఆదేశించారు. ట్రాఫిక్, లెవెల్ క్రాసింగ్, ప్రయాణీకులకు సౌకర్యాల కల్పన పనులన్నీ నిర్ణయించిన సమయంలోగా పూర్తి చేయాలని అన్నారు. శనివారం రైల్ నిలయం నుంచి జోన్ పరిధిలోని ఆరు డివిజన్ల మేనేజర్లు, వివిధ విభాగాల అధిపతులతో వీడియో కానె్ఫరెన్స్ నిర్వహించిన జిఎం పలు అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. ఆయా పనులకు సంబంధించి కేటాయించిన నిధులను వినియోగించేందుకు ప్రాధాన్యత క్రమంలో వ్యవహరించాలని స్పష్టం చేశారు. రైల్వే ప్రయాణీకుల అవసరాల మేరకు పని చేసి మిగిలిన ఆర్థిక సంవత్సరం మంచి ఫలితాలు సాధించాలని అన్నారు. పలు చోట్ల గూడ్స్ షెడ్స్, చర్లపల్లిలో శాటిలైట్ స్టేషన్, తిరుపతి రైల్వే స్టేషన్‌లో పశ్చిమ వైపు ప్రవేశ మార్గం, కాజిపేట బైపాస్ లైన్ నిర్మాణం వంటి అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని జిఎం అన్నారు.
ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలు, స్టేషన్ భవనాల ఆధునీకరణ, వెయిటింగ్ హాళ్లు, లిఫ్ట్‌ల నిర్మాణం, దివ్యాంగులకు సంబంధించిన పనులు వంటి ప్రయాణీకుల సౌకర్యాల కల్పన పనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిఎం ఆయా శాఖాధితులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు జిఎం ఎకె గుప్తా, ప్రిన్సిపల్ చీఫ్ ఇంజినీర్ ఎస్‌ఎన్ సింగ్, చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ ఎన్.మధుసూధన రావు, రైల్ నిలయంలోని ఇతర విభాగాల అధిపతులు పాల్గొన్నారు.