తెలంగాణ

నల్లమలలో మళ్లీ అలజడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 8: నల్లమల అటవీ ప్రాంతంలో మళ్లీ అలజడి మొదలైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలకు అనుమతి ఇవ్వడంతో అనుమతులను నిరసిస్తూ నల్లమల అటవీ ప్రాంత ప్రజలు ఆందోళన బాట పట్టారు. శనివారం నల్లమల అటవీ ప్రాంతంలోని నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని అమ్రాబాద్, పదరా మండలాల బంద్‌కు జెఎసి పిలుపునివ్వడంతో బంద్ సంపూర్ణంగా కొనసాగింది. అటవీ ప్రాంతంలోని ఆదివాసి చెంచులు బంద్‌లో పాల్గొని యురేనియం తవ్వకాలకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ బంద్ ఉద్రిక్తతకు దారి తీసింది.
బంద్‌లో భాగంగా ప్రజలు హైదరాబాద్- శ్రీశైలం ప్రధాన రహదారిని దిగ్బంధం చేశారు. మన్ననూర్ దగ్గర వందలాది మంది పదరా, అమ్రాబాద్ మండలాల ప్రజలు రోడ్డుపై బైఠాయించారు. గంటల తరబడి రోడ్డును దిగ్బంధించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి రోడ్డుపై బైఠాయించిన జెఎసి, కాంగ్రెస్ నాయకులను ఆరెస్టు చేశారు. దీంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వాలు చెంచుజాతిని లేకుండా చేసేందుకు యురేనియం తవ్వకాలకు అనుమతించాయని అన్నారు.
నల్లమల అటవీ ప్రాంతాన్ని విధ్వంసానికి గురి చేస్తే సహించేది లేదన్నారు. యురేనియం తవ్వకాలతో వెలువడే వ్యర్థ పదార్థాలు కృష్ణానదిలో కలువనున్నాయని దాంతో కృష్ణానది కలుషితమయ్యే ప్రమాదం ఉందన్నారు. నీరు విషంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని శాస్తవ్రేత్తలు చెబుతుంటే ప్రభుత్వాలు మాత్రం యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇవ్వడం సిగ్గుచేట్టన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు కృష్ణానది నీరు తాగు, సాగునీటి అవసరాలకు ఉపయోగిస్తున్నారని ఈ నీరంతా కలుషితమైతే ప్రజల ప్రాణాలకే ముప్పు వాటిల్లనుందన్నారు. జీవజాలం, జంతుజాలానికి సమతుల్యమైనటువంటి వాతావరణాన్ని అందిస్తున్న నల్లమల అడవిలో యురేనియం తవ్వితే వన్యప్రాణులకు ప్రమాదమన్నారు. నల్లమలలోని ప్రజలకు హాని కలిగించే టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని నల్లమల అటవీ ప్రాంతం నుండి మరో పోరాటం జరగనుందని దాంతో ముఖ్యమంత్రి కెసిఆర్ కుర్చీ కూలడం ఖాయమని హెచ్చరించారు.

చిత్రం.. నల్లమల అడవిలో యురేనియం తవ్వకాలకు
అనుమతివ్వడాన్ని నిరసిస్తూ హైదరాబాద్-శ్రీశైలం రహదారిపై రాస్తారోకో చేస్తున్న వివిధ గ్రామాల ప్రజలు