తెలంగాణ

రూ.పది వేల పరిమితి ఎత్తివేత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 9: సీనియర్ సిటిజన్లకు శుభవార్త. ప్రస్తుతం తల్లిదండ్రులు, సీనియర్ సిజిజన్స్ సంక్షేమం, నిర్వహణ చట్టం కింద కుమారులు తమ తల్లిదండ్రులకు నెలకు పదివేల రూపాయలకంటే మించి చెల్లించకుండా పరిమితి ఉంది. ఈ సీలింగ్‌ను ఎత్తివేస్తూ కేంద్రం ఈ చట్టానికి సవరణలు తేనుంది.
ఈ విషయమై రాష్ట్రప్రభుత్వాల అభిప్రాయాలను కోరింది. దేశంలోని అన్ని రాష్ట్రప్రభుత్వాలు ఈ చట్టానికి సవరణలు తెచ్చి మెయింటెనెన్స్ ను పదివేల రూపాయలకు మించి చెల్లించాలన్న నిబంధనలకు అంగీకారాన్ని తెలిపాయి. పదివేలకు మించి ఎంత చెల్లించాలన్న దానిపై నిర్ణయాధికారాన్ని ట్రిబ్యునల్‌కు వదిలేస్తారు. చాలా మంది తల్లిదండ్రులు వృద్ధాప్యంలో బతుకుదెరువు నిమి త్తం సంతానంపై ఆధారపడుతారు. చాలా మంది పిల్లలు తల్లిదండ్రుల పట్ల నిర్దయ తో వ్యవహరిస్తున్న సంఘటనలు జరిగాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని 2007లో కేంద్రం సీనియర్ సిటిజన్స్, తల్లిదండ్రుల సంరక్షణ నిమిత్తం చట్టం తెచ్చింది. ఈ చట్టం ప్రకారం పదివేల రూపాయలు చెల్లింపునకు మాత్రమే పరిమితి విధించారు. ఈ చట్టం అమలుకు సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్స్‌ను ఏర్పాటు చేశారు.
ఈ ట్రిబ్యునల్స్‌కు ఉన్న అధికారాలు విస్తృతం చేసేందుకు వీలుగా శాసనంలో మార్పులు తెచ్చేందుకు కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ చేసిన ప్రతిపాదనలకు అన్ని రాష్ట్రాలు ఆమోదం తెలపడంతో వచ్చే పార్లమెంటు సమావేశాల్లో సవరణలు రానున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా అనేక సీనియర్ సిటిజన్స్ సంక్షేమ సంఘాలు తమ పిల్లలు చెల్లిస్తున్న పదివేల రూపాయల సొమ్ము చాలడం లేదని సీలింగ్‌ను తొలగించి పెంచాలని కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖను కోరాయి. సీనియర్ సిటిజన్స్‌కు ఇంటి వద్దనే సేవలు అందించే విధంగా చట్టంలో మార్పులు తేనున్నారు. దీని వల్ల ఇంటి వద్ద సేవలు అందించే సంస్థలను కూడా నియంత్రించవచ్చు.