తెలంగాణ

టిఆర్‌ఎస్‌లో సందడే సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 9: టిఆర్‌ఎస్ పార్టీలో సందడి నెలకొంది. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జిల్లాల్లో జోరుగా సాగుతోంది. లక్ష్యాన్ని మించి ఇప్పటికే 57లక్షల మంది సభ్యత్వ నమోదు చేసుకున్నారు. ఇంకా జిల్లాల్లో సభ్యత్వ నమోదు జరుగుతోంది. మరోవైపు ఈనెల 21న హైదరాబాద్‌లో టిఆర్‌ఎస్ ప్లీనరీ 27న వరంగల్‌లో జరిగే బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. రాజ్యసభ సభ్యులు కే కేశవరావు అధ్యక్షతన తీర్మానాల కమిటీ రోజూ సమావేశం అవుతోంది. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలన్నింటిపైనా ప్లీనరీలో తీర్మానాలు చేస్తారు. ఆయా అంశాలపై ప్లీనరీలో చర్చించడం ద్వారా ప్రజల్లో విస్తృతంగా తీసుకు వెళ్లాలని భావిస్తున్నారు. మొత్తం 12 అంశాల్లో తీర్మానాలు చేస్తున్నారు. ఆసరా, కళ్యాణలక్ష్మి వంటి సంక్షేమ పథకాలపై చర్చిస్తారు.
ప్రధానంగా బిసి సంక్షేమం, గొర్రెల పెంపకం, మత్స్య కారులు, చేనేత, గీత వృత్తి పని వారి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై చర్చ జరపడం ద్వారా బిసిలకు పెద్ద పీట వేస్తున్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లే విధంగా చర్చించాలని నిర్ణయించారు. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన అభివృద్ధి, విద్యుత్ రంగంలో సాధించిన ప్రగతిపై చర్చిస్తారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణంలో కొంత ఆలస్యం అయినప్పటికీ ఎన్నికల నాటికి రెండున్నర లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్టు సభలో ముఖ్యమంత్రి ప్రకటిస్తారు. ఇంటింటికి మంచినీటిని అందించే మిషన్ భగీరథ పథకం ఎంత వరకు వచ్చిందో వివరిస్తారు. ఇంటింటికి మంచినీటిని ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగం అని తొలుత కెసిఆర్ ప్రకటించారు. ఆ తరువాత ఇటీవల బడ్జెట్ సమావేశాల్లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించక పోయినా ఓట్లు అడగం అని కెసిఆర్ చాలెంజ్ చేశారు. ఈ రెండు పథకాలను ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అంశాన్ని సభలో వివరిస్తారు. కొంపల్లిలో 21న ప్లీనరీ జరుగుతుంది. 27న వరంగల్‌లో బహిరంగ సభ జరుగుతుంది.