తెలంగాణ

ప్రశ్నిస్తుంటే అణచివేస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, మార్చి 25: ప్రశ్నించే ప్రతి ఒక్కరినీ అణిచి వేస్తూ బెదిరించి, ఏదో ఆశలు చూపి ప్రతిపక్షాలను బలహీన పర్చాలని సిఎం కెసిఆర్ చూస్తున్నారని ఎఐసిసి అధికార ప్రతినిధి, మాజీ ఎంపి మధుయాష్కి అన్నారు. శుక్రవారం జగిత్యాల ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్‌రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మధుయాష్కి మాట్లాడుతూ రోహిత్ మరణానికి కారణం విసి అప్పారావేనని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొనడంతోపాటు హెచ్‌ఆర్‌సి కమిటీ ఉన్నందున తిరిగి విసిని ఎలా కొనసాగిస్తారని అప్పారావును వెంటనే రీకాల్ చేయాలని మధుయాష్కి డిమాండ్ చేశారు.
జెఎన్‌యు నాయకులు కన్నయ్య హైదరాబాద్‌కు వస్తే పోలీసులు దౌర్జన్యానికి దిగారని, భాను అనే విద్యార్థిని తీవ్రంగా కొడుతూ పౌరుష పదజాలాన్ని ఉపయోగించారని, పోలీసులు పెట్రోగి పోవడానికి కారణం సిఎం కెసిఆరే నని ఆరోపించారు. దళితుడైన రోహిత్ వేముల మరణిస్తే ఆ కుటుంబాన్ని సిఎం కెసిఆర్ పరామర్శించకపోవడం దారుణమని, ఇది ముమ్మాటికీ కుల దురహంకారమేనని ధ్వజమెత్తారు.
బడ్జెట్‌లో 75శాతం కుటుంబ సభ్యులకే కేటాయించారని, కాంగ్రెస్ హయాంలో ఇరిగేషన్‌లో అవినీతి జరిగిందని ఆరోపించిన మంత్రి హరీష్‌రావు వాటర్ గ్రిడ్ పథకంలో అతి పెద్ద అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రపంచంలో అతిపెద్ద అవినీతి వాటర్ గ్రిడ్ పథకమని, జర్నలిస్టులకు మెడికల్ రీఎంబర్స్‌మెంట్, అక్రిటెషన్ కార్డులు ఇవ్వడం లేదన్నారు.