తెలంగాణ

వారసుడొస్తున్నాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 9: ఎన్నికలు లేవు, ప్రత్యేక సందర్భం లేదు, ప్రారంభోత్సవాలు, శంకు స్థాపనలు లేవు అయినా ముఖ్యమంత్రి కెసిఆర్ కుమారుడు, ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. బహిరంగ సభల్లో ప్రసంగిస్తున్నారు. సోదరి ఎంపి కవిత సైతం కెటిఆర్‌కు మద్దతుగా సభలో పాల్గొన్నారు. కెసిఆర్ రాజకీయ వారసుడు కెటిఆర్ అని అధికార ప్రకటన వెలువడ లేదు కానీ అంతా సిద్ధం అవుతోంది. ప్రభుత్వంలో ఇప్పటికే కెసిఆర్ తరువాత కెటిఆర్ అని స్పష్టమైంది. ఇప్పు డు పార్టీలో సైతం కెసిఆర్ తరువాత కెటిఆర్ అనే విధంగా జిల్లాల్లో సభలు నిర్వహిస్తున్నారు. టిఆర్‌ఎస్‌లో కెసిఆర్, కెటిఆర్, హరీశ్‌రావు, కవిత నలుగురు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కెసిఆర్ వారసుడు కెటిఆర్ అనే నిర్ణయం ఎప్పుడో అయిపోయినా దానికి స్పష్ట త ఇచ్చే విధంగా సభలు నిర్వహిస్తున్నారు. రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో భారీ బహిరంగ సభలు జరిగాయి. తొలిసారిగా ఆర్మూర్ సభలో కెటిఆర్‌తో పాటు ఆయన సోదరి నిజామాబాద్ ఎంపి కవిత ప్రసంగించారు. కెటిఆర్‌కు వెన్నంటి ఉంటానని ప్రకటించారు. కెసిఆర్ మేనల్లుడు తన్నీరు హరీశ్‌రావు పలు ఇంటర్వ్యూల్లో కెసిఆర్ తనకు ఏ బాధ్యత అప్పగిస్తే అది చేస్తానని, తానీ స్థానంలో ఉండడానికి కెసిఆర్ కారణమని చెబుతూ వస్తున్నారు. దీంతో కెసిఆర్ వారసునిగా కెటిఆర్‌కు ఎలాంటి అడ్డంకులు లేవు అనే సందేశం పరోక్షంగా పార్టీ శ్రేణులకు పంపినట్టు అయింది. కెటిఆర్ నా వారసుడు అని కెసిఆర్ బహిరంగంగా ప్రకటించడం మిన హా వారసత్వ ఏర్పాట్లు అన్నీ జరిగిపోయాయి.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు వారసునిగా కెటిఆర్‌కు తొలి పరీక్ష. గ్రేటర్ ఎన్నికల్లో కెసిఆర్ కేవలం ఒక సభలో మాత్రమే ప్రసంగించగా, కెటిఆర్ నగరమంతా విస్తృతంగా పర్యటించారు. ఎన్నికల ప్రచార బాధ్యతను వంటి చేత్తో విజయవంతంగా నిర్వహించారు. ఊహించని విధంగా హైదరాబాద్‌లో 99 డివిజన్లలో టిఆర్‌ఎస్ విజయంతో వారసునిగా కెటిఆర్ తొలి పరీక్షను విజయవంతంగా ఎదుర్కొన్నారు. అప్పటి నుంచి మంత్రివర్గంలోనూ, అధికార గణంలో కెటిఆర్ ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది. కెసిఆర్‌ను కలువలేని వాళ్లు కెటిఆర్‌ను కలుస్తున్నారు. ప్రభుత్వంలో కెసిఆర్ తరువాత కెటిఆర్ అనే అభిప్రాయం బలంగా ఏర్పడింది. వచ్చే ఎన్నికలకు ఇంకా రెండేళ్ల గడువు ఉండడంతో ఇప్పుడు కెసిఆర్ పార్టీపై కూడా దృష్టిసారించారు. ఇప్పటి వరకు అధికారిక కార్యక్రమాల్లోనే తప్ప పార్టీ కార్యక్రమాల్లో కెటిఆర్ వారసునిగా ముద్ర వేసుకోలేదు. ఇప్పుడు పార్టీలో సైతం కెసిఆర్ తరువాత స్థానం కెటిఆర్‌దే అనే విధంగా సభలు నిర్వహిస్తున్నారు. ఈనెల 27న టిఆర్‌ఎస్ ప్లీనరీ హైదరాబాద్‌లో జరుగుతుంది. కొత్త అధ్యక్షునితో పాటు కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు. ఇదే ఎన్నికల టీం అవుతుంది. ఈ బృందంలో కెటిఆర్ కీలక పాత్ర వహించనున్నారు.
దాని కోసం ప్లీనరీ కన్నా ముందే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. పూర్వ మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని కొత్త జిల్లాల్లో, రంగారెడ్డి జిల్లాలోని కొత్త జిల్లాల్లో, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో కెటిఆర్ సభలు విజయవంతం అయ్యాయి. జగిత్యాలలో 17న, మంచిర్యాలలో 18,19 తేదీల్లో పర్యటిస్తారు. ప్లీనరీ కన్నా ముందుగానే దాదాపుగా అన్ని జిల్లాల్లో ఒక దఫా పర్యటన పూర్తవుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్లీనరీ నుంచి పార్టీపై సైతం కెటిఆర్ ప్రభావం కనిపిస్తుందని టిఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. కెసిఆర్‌తో పాటు కుటుంబ సభ్యులు కవిత, హరీశ్‌రావులు మద్దతు పలకడంతో వారసత్వ ప్రకటనలో కెటిఆర్‌కు ఎలాంటి అడ్డంకులు లేకుండా పోయాయి.