తెలంగాణ

ఆలయాలకు పాలకవర్గాల నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 10: దేవాదాయ శాఖ పరిధిలోని పలు ఆలయాలకు పాలక మండలి సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సిద్దిపేట జిల్లాలో మూడు దేవాలయాలకు ట్రస్ట్ బోర్డు సభ్యులను నియమించారు. సిద్దిపేట పట్టణంలోని శరభేశ్వర స్వామి దేవాలయానికి ఆరుగురిని, కోటిలింగేశ్వర స్వామి అలయానికి ఆరుగురిని, మార్కెట్ చౌరస్తాలోని వీర హనుమాన్ దేవాలయానికి ఏడుగురిని, హైదరాబాద్ దోమల్‌గూడలోని హనుమాన్ దేవాలయానికి ఏడుగురు పాలక మండలి సభ్యులను నియమిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

రాణీ మనోల్య పిటిషన్‌పై విచారణ వాయిదా

హైదరాబాద్, ఏప్రిల్ 10: నిజాం రాజు ముఖరంజా నుండి పరిహారం ఇప్పించాలని కోరుతూ రాణి మనోల్య, ఆమె కుమార్తె నీలోఫర్ దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన హైకోర్టు ఏప్రిల్ 27కు విచారణను వాయిదా వేసింది. జస్టిస్ సివి నాగార్జునరెడ్డి, జస్టిస్ రజనిలతో కూడిన డివిజన్ బెంచ్ రాణి మనోల్య పిటిషన్‌ను విచారణకు స్వీకరించారు. మహెర్ కింద 7 లక్షల డాలర్లు, రుణం చెల్లింపునకు 3 లక్షల డాలర్లు, జీవన భృతికింద 15వేల డాలర్లు, కుమార్తెకు 500 డాలర్లు ఇప్పించాలని కోరారు. దీనిపై ఉభయతారక పరిష్కారం కోసం ప్రయత్నించాలని వ్యాఖ్యానించిన బెంచ్ కేసు విచారణను వాయిదా వేసింది.
హైకోర్టు స్టాండింగ్ కౌన్సిళ్లకు భృతి పెంపు

హైదరాబాద్, ఏప్రిల్ 10: ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన హైకోర్టులో పనిచేసే స్టాండింగ్ కౌన్సిళ్లకు నెలవారీ చెల్లించే గౌరవ వేతనాన్ని తెలంగాణ ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు న్యాయ శాఖ కార్యదర్శి ఎ సంతోష్‌రెడ్డి పేరుతో సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటివరకు స్టాండింగ్ కౌన్సిళ్లకు నెలకు 15 వేల రూపాయలు చెల్లించేవారు, ఇక నుండి నెలకు 30 వేల రూపాయలు చెల్లిస్తామని ఈ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఇందుకు సంబంధించి ఆర్థిక శాఖ కూడా అనుమతి ఇచ్చింది. అయితే మూసివేత దశలో ఉన్న ప్రభుత్వ రంగం సంస్థలకు, కార్యకలాపాలు నామమాత్రంగా కొనసాగుతున్న సంస్థలకు ఈ ఉత్తర్వులు వర్తించబోవని స్పష్టం చేశారు.

సాంకేతిక లోపంతో నిలిచిన ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్
భువనగిరి, ఏప్రిల్ 10: భువనగిరి మండలంలోని పగిడిపల్లి స్టేషన్‌లో విశాఖ నుండి ముంభై వెళ్ళే ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ వైపు వెళ్ళే ట్రాక్‌పై సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. సోమవారం మధ్యాహ్నం సుమారు 2గంటల పాటు ఎక్స్‌ప్రెస్ రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురికాగా రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రత్యేకంగా ఇంజన్‌ను రప్పించి ఎక్స్‌ప్రెస్ రైలును సికింద్రాబాద్‌కు తరలించినట్టు రైల్వే అధికారులు తెలిపారు.

ఎఎస్‌ఆర్‌టియు
చైర్‌పర్సన్‌గా రమణారావు

హైదరాబాద్, ఏప్రిల్ 10: అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండర్‌టేకింగ్స్ (ఏఎస్‌ఆర్‌టియు) స్టాండింగ్ కమిటీ (ట్రాఫిక్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ పాలసీ) చైర్‌పర్సన్‌గా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జివి రమణరావు నియమితులయ్యారు. 2018 వరకు చైర్‌పర్సన్‌గా కొనసాగుతారని సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. టిఎస్‌ఆర్టీసి ఆవిర్భావం తరువాత తొలిసారిగా ఎఎస్‌ఆర్‌టియు స్టాండింగ్ కమిటీ చైర్‌పర్సన్‌గా సంస్థ ఎండి నియామకం కావడం అరుదైన గౌరవం. చైర్‌పర్సన్‌కు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణ, ఈశాన్య జోన్‌ల నుంచి ముగ్గురు చొప్పున, రాష్ట్రానికి ఒక్కరికి మించకుండా స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ అండర్ టేకింగ్ సభ్యత్వం కలిగిన (విభాగాధిపతి హోదాకు తగ్గకుండా) 15 మంది సభ్యులను మిళితం చేయడానికి స్వేచ్ఛ్ధాకారం ఉంటుంది. కనీసం ఏడాదికి రెండు సార్లు కమిటీ సమావేశం నిర్వహించాల్సి ఉంటుందని ఉత్తర్వులో పేర్కొన్నారు.
ఐఐసిటి శాస్తవ్రేత్తకు
అరుదైన పురస్కారం

హైదరాబాద్, ఏప్రిల్ 10: హైదరాబాద్ సిఎస్‌ఐఆర్- ఐఐసిటిలో కెమికల్ బయాలజీ విభాగం ముఖ్య శాస్తవ్రేత్తగా సేవలు అందిస్తున్న డాక్టర్ అరబింద చౌదరి లండన్‌లోని రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ ఫెలోగా ఎన్నికయ్యారు. రసాయన, జీవశాస్త్రాలలో ఆయన చేసిన అసాధారణ సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం లభించినట్టు ఐఐసిటి అధికారులు పేర్కొన్నారు. డాక్టర్ అరబింద చౌదరి 1994 నుండి ఐఐసిటిలో విధులు నిర్వహిస్తున్నారు. క్యాన్సర్ చికిత్సకు ఉపయోగపడే పలు పరిశోధనల్లో డాక్టర్ చౌదరి నాయకత్వంలోని బృందం విశిష్టమైన కృషి చేసింది. చౌదరి అమెరికాలోని ప్రతిష్టాత్మకమైన స్పేట్ యూనివర్శిటీ ఆఫ్ న్యూజెర్సీలోనూ, హార్వర్టు మెడికల్ స్కూల్‌లోనూ ఉన్నత విద్యను అభ్యసించారు. లైపో సోమల్ జీన్, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌కు సంబంధించిన అనేక వ్యాసాలు పలు అంతర్జాతీయ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. అనేక భారతీయ పేటెంట్లకు ఆయన కో ఇనె్వంటర్‌గా ఉన్నారు.

కారుణ్య నియామకాలకు
సర్కారు అంగీకారం
కమిటీ చైర్మన్‌గా రాజేశ్వర్ తివారీ

హైదరాబాద్, ఏప్రిల్ 10: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా అనారోగ్య కారణాల వల్ల తప్పనిసరిగా పదవీ విరమణ చేస్తే, వారి కుటుంబంలో అర్హులైన ఒకరికి కారుణ్య విధానంలో ఉద్యోగం ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. కారుణ్య నియామకాల కోసం ప్రభుత్వం రాష్టస్థ్రాయిలో ప్రత్యేకంగా ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీకి వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీని చైర్మన్‌గా నియమించారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి. సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా అనారోగ్య కారణాల వల్ల పదవీ విరమణ చేస్తే, వారి కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం ఇచ్చేందుకు ఈ కమిటీ పరిశీలన చేస్తుంది. మెడికల్ బోర్డులు జారీ చేసే నివేదికలను కమిటీ కూలంకషంగా పరిశీలిస్తుంది.