తెలంగాణ

రోడ్డు ప్రమాదాల్లో... ఐదుగురు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తకోట, మార్చి 25: ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న సంఘటనలో ముగ్గురు యువకులు మృతి చెందారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోటలో శుక్రవారం జరిగింది. ఎస్సై కృష్ణ వివరాల ప్రకారం.. శుక్రవారం తెల్లవారుజామున కొత్తకోట నుండి పెబ్బేరు వైపు స్పోర్ట్ బైక్‌పై వెళ్తుండగా గుర్తు తెలియని లారీ ఢీకొట్టింది. రోడ్డు పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొని హరీష్ (18), మహేష్ (19), శశాంక్ రెడ్డి (17) అనే యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఇటీవలే ఇంటర్ పూర్తి చేసుకుని సెలవుల్లో స్నేహితులతో కలిసి గురువారం రాత్రి సినిమాకు వెళ్లి శశాంక్ రెడ్డి ఇంటిపైన నిద్రించి అర్ధరాత్రి మరో స్నేహితునితో బైకుపై వెళ్లి మృత్యువాతకు గురయ్యారు. శశాంక్ రెడ్డి తండ్రి కృష్ణమోహన్ రెడ్డి రెండేళ్లక్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఇపుడు రోడ్డు ప్రమాదంలో కొడుకు శశాంక్‌రెడ్డి కూడా మరణించడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు సిఐ కిషన్ తెలిపారు.
మహదేవ్‌పూర్‌లో...
మహాదేవపూర్: కరీంనగర్ జిల్లా కాళేశ్వరంలో అస్థికల నిమజ్జనానికి వచ్చి, స్వగ్రామానికి బయలు దేరిన వాహనం టైరు పంక్చర్ కావడం, అతి వేగంతో అదుపు తప్పి బోల్తా పడడంతో అందులో ప్రయాణిస్తున్న 24 మంది గాయాలపాలు కాగా ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మహాదేవపూర్ ఆసుపత్రిలో క్షతగాత్రుల హాహాకారాలతో దద్దరిల్లింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. వరంగల్ జిల్లా మొగుళ్లపల్లి మండలం ఈస్‌పేటకు చెందిన యార మల్లమ్మ కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం తన మనుమరాలి అస్థికల నిమజ్జనానికి కరీంనగర్ జిల్లా కాళేశ్వరంలోని త్రివేణి సంగమానికి వచ్చారు. పిండ ప్రదానాలు పూర్తి చేసుకున్న అనంతరం వారు తీసుకొచ్చిన బొలేరో ట్రాలీ వాహనం నెంబర్ ఏపి 36 వై 6448లో తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. మహాదేవపూర్ మండలం కుదురుపల్లి సమీపంలోని మూలమలుపు వద్ద వాహనం టైర్ పంక్చర్ కావడం, అతి వేగంతో అదుపు తప్పి బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న 24 మంది వాహనం నుంచి ఎగిరిపడ్డారు. చెల్లా చెదురుగా పడివున్న క్షతగాత్రులను వైద్య సహాయం నిమిత్తం మహాదేవపూర్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఇందులో ప్రయాణిస్తున్న మల్లమ్మ ఇద్దరు కుమారులు యార మల్లారెడ్డి (45), యార మోహన్‌రెడ్డి (40) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన క్షతగాత్రుల రోదనలతో ఆసుపత్రి దద్దరిల్లింది. వీరందరినీ స్థానికంగా ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు.