తెలంగాణ

కుట్రలో శ్రీలక్ష్మీ భాగస్వామే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 10:దాల్మియా సిమ్మెంట్స్ లీజు కొనసాగింపులో మిగిలిన వారితో కలిసి ఐఎఎస్ అధికారి వై శ్రీలక్ష్మి కూడా కుట్ర పన్నారని సిబిఐ అధికారులు సోమవారం హైకోర్టులో వాదనలు వినిపించారు. తనపై పెట్టిన కేసులను తొలగించాలని కోరుతూ శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ బి శివశంకర్ విచారించినపుడు సిబిఐ తరఫున న్యాయవాది కె సురేందర్ ఈ మేరకు వాదించారు. దిగువస్థాయి అధికారుల అభ్యంతరాలను పక్కన పెట్టి నేరుగా అనుమతి కోసం ప్రభుత్వానికి ఫైలు పంపడంలోనే కుట్ర దాగి ఉందన్నారు.శ్రీలక్ష్మి తరఫున హాజరైన న్యాయవాదిని లిఖిత పూర్వక వాదనలు వినిపించాలని న్యాయమూర్తి ఆదేశిస్తూ పిటీచషన్ విచారణను గురువారానికి వాయిదా వేశారు.
బాలనేరస్థుల జాబితాలు ఏవి?
బాల నేరస్థుల జాబితాలను సిద్ధం చేయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలను హైకోర్టు సోమవారం నాడు ఆదేశించింది. లీగల్ సర్వీసెస్ అథారిటీ దాఖలు చేసిన పిల్‌ను స్వీకరించిన హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సివి నాగార్జునరెడ్డి, జస్టిస్ టి రజనిలతోకూడిన డివిజన్ బెంచ్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. మహిళా ఖైదీలు, బాలలు, విచారణలో ఉన్న మానసిక వికలాంగులు, ఇతరులకు సంబంధించిన హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని హైకోర్టు పేర్కొంది.
పంచాయతీలకూ ఆదాయం ఇవ్వండి
హెచ్‌ఎండిఎ వసూలు చేసిన ఆదాయాన్ని సంబంధిత పంచాయతీలకూ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని హైకోర్టు సోమవారం హెచ్‌ఎండిఎను ఆదేశించింది. కొంపల్లి గ్రామ పంచాయితీ దాఖలు చేసిన పిటీషన్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాధన్, జస్టిస్ సీమా అక్తర్‌లతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది.