తెలంగాణ

అనధికార అడ్మిషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 11: తెలంగాణ ప్రభుత్వం ఆన్‌లైన్ అడ్మిషన్లను చేపట్టినపుడు తమకు ఇష్టం లేదని తప్పుకున్న డిగ్రీ కాలేజీలు అడ్మిషన్ల అనంతరం విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందినట్టు తాజాగా వెల్లడైంది. తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లకు గత ఏడాది ఆన్‌లైన్ పద్ధతిని ప్రవేశపెట్టింది. ఆ సమయంలో ప్రభుత్వం సూచించిన ఫీజులు తమకు ఏ విధంగానూ సరిపోవని పేర్కొంటూ కొన్ని డిగ్రీ కాలేజీల యజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి.
దాంతో స్టే తెచ్చుకున్న డిగ్రీ కాలేజీలు తామే సొంతంగా అడ్మిషన్లు చేపట్టాయి. విద్యార్ధులను చేర్చుకున్న తర్వాత వారితో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసినట్టు తాజా పరిశీలనల్లో తేలింది. ఈ సంగతి తెలిసిన తర్వాత ఆయా కాలేజీలపై చర్యలు తీసుకుందామనుకున్నా వాటికి ఎలాంటి గుర్తింపు లేదు. గుర్తింపు లేని కాలేజీలపై చర్యలకు న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులు ఒక అడ్డంకిగా మారగా, ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో తమ ప్రమేయం ఏమీ లేదని కాలేజీలు తప్పించుకుంటున్నాయి.
విద్యార్ధులు దరఖాస్తు చేశారని దాంతో తమకు సంబంధం లేదని యాజమాన్యాలు వాదిస్తున్నాయి. ఈ క్రమంలో కాలేజీలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న మీమాంసలో ప్రభుత్వం పడిపోయింది. దాదాపు 42 కాలేజీలు ఈ విధంగా ప్రభుత్వ నిధులను కొల్లగొట్టినట్టు ఆడిటింగ్‌లో వెల్లడైంది. ఈ యాజమాన్యాలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పాలని ఇప్పటికే న్యాయవాదులతో అధికారులు సంప్రదిస్తున్నారని తెలిసింది.