తెలంగాణ

ప్లీనరీ ఖర్చుల కోసం ‘గులాబి కూలీ దినాలు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

14 నుంచి 20 వరకూ నిర్వహణ 2 రోజులపాటు నేనూ కూలికి వెళ్తా
పార్టీ నేతలూ వెళ్లితీరాల్సిందే.. 21న ప్లీనరీలో అధ్యక్షుని ఎన్నిక
మంత్రి నాయిని అధ్యక్షతన కమిటీ తెరాస అధినేత కెసిఆర్ వెల్లడి

హైదరాబాద్, ఏప్రిల్ 12: టిఆర్‌ఎస్ పార్టీ అవిర్భావ దినోత్సవం, ప్లీనరీ ఖర్చుల కోసం ఎప్పటి మాదిరిగానే తనతో పాటు పార్టీ నేతలంతా రెండు రోజుల పాటు కూలీ పనులు చేయాలని నిర్ణయించినట్టు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు తెలిపారు. ప్రగతి భవన్‌లో బుధవారం మంత్రిమండలి సమావేశం ముగిసిన అనంతరం పార్టీ ప్లీనరీ, వరంగల్‌లో జరుగబోయే బహిరంగ సభ వివరాలను కెసిఆర్ మీడియాకు తెలిపారు. పార్టీ 16 వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఖర్చుల కోసం డబ్బుల సమీకరణ కోసం రాష్టవ్య్రాప్తంగా ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు ‘గులాబి కూలీ దినాలు’ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్టు చెప్పారు. దీంట్లో భాగంగా తాను కూడా రెండు రోజుల పాటు కూలీ పనులకు వెళ్తానన్నారు. పార్టీ నేతలు కూడా ప్రతీ ఒక్కరు రెండు రోజుల పాటు కూలీ పనులు చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. లక్షల మంది హాజరయ్యే ప్లీనరీ, బహిరంగ సభ నిర్వహణ ఖర్చులు భారం కాకుండా ఉండేందుకు గతంలో మాదిరిగానే కూలీ పనులు చేయానున్నామన్నారు. సభకు వచ్చే వారి భోజనం, రవాణా ఖర్చులను ఎవరంతకు వారే భరించడానికి కూలీ పనులు ప్రతీ ఒక్కరూ చేయాల్సిందేనని కెసిఆర్ అన్నారు. పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమం విజయవంతంగా పూర్తి అయిందని, రికార్డు స్థాయిలో 75 లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారన్నారు. రాష్ట్ర జనాభా 3 లక్షల 64 మంది కాగా అందులో టిఆర్‌ఎస్ సభ్యత్వాన్ని 75 లక్షల మంది స్వీకరించారన్నారు. దీంతో పార్టీ సభ్యత్వాల సంఖ్యలో టిఆర్‌ఎస్ పార్టీ దేశంలోనే అతి పెద్ద పార్టీల్లో ఒకటిగా నిలువబోతుందన్నారు. సభ్యత్వ రుసుం కింద రూ. 25 నుంచి 30 కోట్ల వరకు పార్టీకి డబ్బు రానుందని, ఇప్పటికే రూ. 13 కోట్లు రాగా పార్టీ ఖాతాలో జమా చేశామన్నారు. ఈ నెల 21న హైదరాబాద్‌లో పార్టీ ప్లీనరీ, పార్టీ అవిర్భావం రోజు 27న వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నట్టు కెసిఆర్ ప్రకటించారు. ప్లీనరీలో పార్టీ అధ్యక్షుని ఎన్నిక నిర్వహించడానికి నాయిని నరసింహరెడ్డి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశామన్నారు. గతంలో కూడా పార్టీ అధ్యక్షుని ఎన్నికలను నాయిని నిర్వహించారని గుర్తు చేశారు.

chitram..
మంత్రులతో కలిసి తెరాస ప్లీనరీ వివరాలు వెల్లడిస్తున్న పార్టీ అధినేత, సిఎం కెసిఆర్